కారు డ్రైవ్ చేస్తోంది లేడీ డాక్టర్.. ప్రమాదం ఇలా..?

సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ప్రమాద సమయంలో ఓ మహిళ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబయి వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ముంబయికి చెందిన ప్రముఖ వైద్యురాలు అనహిత పండోలే ఆ సమయంలో కారు నడుపుతున్నారు. ముందు సీట్లో ఆమె పక్కనే భర్త డారియస్ పండోలే కూర్చున్నారు. వెనుక సీట్లో డారియస్ సోదరుడు జహంగీర్ పండోలే, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కూర్చున్నారు.

 lady doctor drive car as cyrus mistry sat in the back seat

పాల్ఘాట్ జిల్లాలో చరోటీ వద్ద అనహిత పండోలే రాంగ్ సైడ్ నుంచి మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు 120 కిమీ వేగంతో వెళుతోంది. కారు అదుపుతప్పడంలో డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. సైరస్ మిస్త్రీతో పాటు వెనుక సీట్లో కూర్చున్న జహంగీర్ పండోలే కూడా మృతి చెందారు. ముందు సీట్లో ఉన్న అనహిత, ఆమె భర్త డారియస్ గాయాలతో బయటపడ్డారని పోలీసులు వివరించారు.

టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. దీంతో పలువురు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మిస్రీ మరణంపై ప్రధాని మోడీ సంతాపం తెలియజేశారు. అతను గొప్ప పారిశ్రామిక వేత్త అని కొనియాడారు. అతని మరణం ప్రపంచ వ్యాపార రంగానికి గొప్ప లోటు అని చెప్పారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+