బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lady leader: మాజీ కార్పోరేటర్ రేఖ హత్య, 50 మంది, బాడీగార్డ్ హంతకుడు, కాల్చిపారేసిన సీఐ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు సిటీలో లేడీ కార్పోరేటర్ రేఖాను అతి దారుణంగా నరికి చంపేసిన ఇద్దరు నిందితులకు పోలీసులు బెల్లెట్ రుచి చూపించారు. పట్టపగలు, నడిరోడ్డులో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నాయకురాలిని నరికిచంపేసిన నిందితులను పట్టుకోవడానికి పోలీసులు తుపాకిలకు పని చెప్పారు. లేడీ కార్పోరేటర్ రేఖా హత్య కేసు విషయంలో సీఎం బీఎస్. యడియూరప్ప సీరియస్ అయ్యారు. అన్నాదానం చెయ్యడానికి సిద్దం అయిన రేఖాను హత్య చెయ్యడంతో పోలీసులు అనేక బృందాలు నిందితుల కోసం గాలించారు. మొత్తం 50 మందిని పోలీసులు విచారణ చేశారు. బెంగళూరు వదిలిపారిపోవడానికి ప్రయత్నించిన హంతకుల మీద పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది.

Illegal affair: ప్రియురాలు నాటుకోడి, రివర్స్, బైపాస్ లో గొంతు కోసి పెట్రోల్ పోసి కాల్చేశాడు!Illegal affair: ప్రియురాలు నాటుకోడి, రివర్స్, బైపాస్ లో గొంతు కోసి పెట్రోల్ పోసి కాల్చేశాడు!

 బీజేపీ లేడీ కార్పోరేటర్

బీజేపీ లేడీ కార్పోరేటర్

బెంగళూరు నగరంలోని ఛలవాదిపాళ్య బీజేపీ మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ ప్లవర్ గార్డెన్ లో నివాసం ఉంటున్నారు. కరోనా వైరస్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్లవర్ గార్డెన్ లోని రేఖ కదిరేష్ కార్యాలయం దగ్గరే రోజూ అన్నదానం జరుగుతోంది. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో రేఖ కదిరేష్ ప్లవర్ గార్డెన్ లోని ఆమె కార్యాలయానికి వెళ్లింది. కార్యాలయం బయట రేఖా కదిరేశన్ బాడీగార్డు పీటర్ ఉన్నాడు.

 పక్కాప్లాన్ తో లేపేశారు

పక్కాప్లాన్ తో లేపేశారు

ఉదయం 10. 30 గంటల సమయంలో అక్క అంటూ బయట నుంచి పిలిచారు. రేఖా కదిరేష్ కార్యాలయంలో నుంచి లేచి బయటకు వెళ్లింది. కార్యాలయం నుంచి రేఖా కదిరేష్ బయటకు వచ్చిన వెంటనే అక్కడే ఉన్న ప్రత్యర్థులు ఒక్కసారిగా కత్తులతో ఆమెను నరికేశారు. కిందపడిన రేఖా కదిరేష్ గొంతుకోసేసి అనుకున్న పనిముగించుకున్న నిందితులు అక్కడి నుంచి పరారైనారు.

 హడలిపోయిన రూలింగ్ పార్టీ నాయకులు

హడలిపోయిన రూలింగ్ పార్టీ నాయకులు

రేఖా గొంతు తెగిపోవడంతో ఆమె కేకలు వెయ్యలేకపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రేఖాను కెంపేగౌడ ఆసుపత్రికి తరలించారు. గొంతు పూర్తిగా తెగిపోవడం, శరీరం మీద కత్తిపోట్లు ఎక్కువ పడడటంతో చికిత్స విఫలమై రేఖా ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. మాజీ కార్పోరేటర్, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకురాలు రేఖా కదిరేష్ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

 రెక్కీ నిర్వహించి చంపేసిన కేటుగాళ్లు

రెక్కీ నిర్వహించి చంపేసిన కేటుగాళ్లు

రేఖా కదిరేష్ కార్యాలయానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రేఖా కార్యాలయానికి ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పైకి, పక్కకు తిప్పేశారని బెంగళూరు సిటీ అడిషనల్ పోలీసు కమీషనర్ మురుగన్ మీడియాకు చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ ను హత్య చేశారని అడిషనల్ పోలీసు కమీషనర్ మురుగన్ అన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి రేఖా హత్య కేసులోని నిందితుల కోసం గాలించారు.

 సీఎం సీరియస్

సీఎం సీరియస్

బీబీఎంపీ మాజీ కార్పోరేటర్, బీజేపీ నాయకురాలు రేఖాను పట్టపగలు, నడిరోడ్డు మీద దారుణంగా నరికి చంపేసిన విషయం తెలుసున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సీరియస్ అయ్యారు. హంతలను 24 గంటల్లో అరెస్టు చేసి వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం బీఎస్ యడియూరప్ప బెంగళూరు సిటీ పోలీసు అధికారుకు ఆదేశాలు జారీ చేశారు.

 కాల్చిపారేసిన పోలీసులు

కాల్చిపారేసిన పోలీసులు

మాజీ కార్పోరేటర్ రేఖా హత్య కేసు విచారణ చేసిన పోలీసులు ఛలవాదిపాళ్యలోని ప్లవర్ గార్డెన్ లో రేఖా హత్యకు గురైన ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని, ప్రత్యక్షసాక్షులతో పాటు మొత్తం 50 మందిని విచారణ చేసి వివరాలు సేకరించారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా పీటర్, సూర్యా తదితరుల కోసం పోలీసులు గాలించారు.

 కాల్చిపారేసిన పోలీసులు

కాల్చిపారేసిన పోలీసులు

సుమనహళ్ళి సమీపంలోని శ్రీ శనిమహాత్మస్వామి దేవాలయం సమీపంలో రేఖా హత్య కేసులో నిందితులు రేఖ బాడీగార్డు పీటర్, సూర్యా పారిపోవడానికి ప్రయత్నించారు. కాటన్ పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ శివస్వామి నిందితులను లొంగిపోవాలని చెప్పారు. పోలీసుల మీద కత్తులతో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన పీటర్, సూర్య మీద ఇన్స్ పెక్టర్ శివస్వామి కాల్పులు జరిపారు.

 జస్ట్ మిస్...... బాడీగార్డు హంతకుడు

జస్ట్ మిస్...... బాడీగార్డు హంతకుడు

పీటర్, సూర్యా కాళ్లలోకి బుల్లెట్ లు దూసుకోవడంతో నిందితులు కుప్పకూలిపోవడంతో ఇద్దరిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రేఖా హత్య కేసులో మిగిలిన నిందితుల కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు. రేఖా హత్య కేసులో ఆహె బాడీగార్డు అరెస్టు కావడంతో రాజకీయ నాయకుల్లో కలవరం రేపింది.

English summary
lady leader: BBMP Ex Corporator Rekha Kadiresh Murder Case: Cottonpet Police Arrest 2 Main Accused Peter and Surya in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X