Lady manager: నకిలి పేస్లిప్స్, రూ. లక్షల్లో లోన్లు ఇచ్చేసిన బ్యాంకు లేడీ మేనేజర్, సంధ్యా చేతివాటం !
బెంగళూరు/ హుబ్బళి/దారవాడ: భారతదేశంలోని నెంబర్ వన్ బ్యాంకులో ఉద్యోగం చేరిన మహిళ బుద్దిగా ఉద్యోగం చేసింది. ప్రమోషన్ మీద ఆమె బ్యాంకు మేనేజర్ గా సిటీలోని ఓ బ్రాంచ్ కు బదిలీ అయ్యింది. బ్యాంకు మేనేజర్ హోదాలో ఆమె అనేక మందికి లోన్ లు మంజూరు చేసింది. బ్యాంకులో కిందిస్థాయి ఉద్యోగులు కుదరదని చెప్పిన చాలా మందికి ఆమె బ్యాంకు రుణాలు ఇచ్చింది. ఆ బ్యాంకు నుంచి ఆమె మరో బ్రాంచ్ కు బదిలి అయ్యారు. కొత్తగా వెళ్లిన బ్యాంకు మేనేజర్ గతంలో లోన్లు తీసుకుని వాయిదాలు తిరిగి చెల్లించని మొండి బకాయిల గురించి ఆరా తీశారు. బ్యాంకులో రుణం తీసుకున్న తరువాత ఒక్క ఈఎమ్ఐ కూడా చెల్లించకుండా కాలం గడిపేస్తున్న కొందరి గురించి కొత్తగా వెళ్లిన బ్యాంకు మేనేజర్ ఆరా తీశారు. నకిలి సంతకాలు, నకిలి పే స్లిప్స్ మీద రుణాలు తీసుకున్న కొందరు బ్యాంకుకు ఈఎమ్ఐలు చెల్లించలేదని వెలుగు చూసింది. గతంలో ఈ బ్యాంకులో పని చేసిన లేడీ మేనేజర్ చేతి వాటం చూపించి లంచాలు తీసుకుని కొన్ని లక్షల రూపాయల రుణాలు ఇచ్చేసి చేతులు దులుపుకుందని వెలుగు చూసింది. కొత్త బ్యాంకు మేనేజర్ కేసు పెట్టడంతో లేడీ బ్యాంకు మేనేజర్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
కర్ణాటకకు చెందిన టీసీ సంధ్యా అలియాస్ సంధ్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగంలో చేరింది. భారతదేశంలోని నెంబర్ వన్ బ్యాంకు అయిన ఎస్ బీఐలో ఉద్యోగం చేరిన సంధ్యా మొదట బుద్దిగా ఉద్యోగం చేసింది. ప్రమోషన్ మీద సంధ్యా బ్యాంకు మేనేజర్ హోదాలో 2019లో హుబ్బళిలోని కేశ్వాపూర శాఖకు బదిలీ అయ్యింది.

లోన్ల మీద లోన్లు ఇచ్చేసిన లేడీ మేనేజర్
బ్యాంకు మేనేజర్ హోదాలో సంధ్యా అనేక మందికి లోన్ లు మంజూరు చేసింది. బ్యాంకులో కిందిస్థాయి ఉద్యోగులు మీకు లోన్లు ఇవ్వడం కుదరని చాలా మందికి చెప్పారు. కిందిస్థాయి ఉద్యోగులు లోన్లు ఇవ్వడం కుదరదని చెప్పినా చాలా మందికి సంధ్యా బ్యాంకు రుణాలు ఇచ్చింది. ఆ బ్యాంకు నుంచి సంధ్యా హాసన్ లోని మరో బ్రాంచ్ కు బదిలి అయ్యి వెళ్లిపోయింది.

చేతివాటం చూపించిన లేడీ మేనేజర్
కొత్తగా వెళ్లిన బ్యాంకు మేనేజర్ గతంలో లోన్లు తీసుకుని వాయిదాలు తిరిగి చెల్లించని మొండి బకాయిల గురించి ఆరా తీశారు. బ్యాంకులో రుణం తీసుకున్న తరువాత ఒక్క ఈఎమ్ఐ కూడా చెల్లించకుండా కాలం గడిపేస్తున్న కొందరి గురించి కొత్తగా వెళ్లిన బ్యాంకు మేనేజర్ ఆరా తీశారు.

రూ. 35 లక్షలు స్వాహా
నకిలి సంతకాలు, నకిలి పే స్లిప్స్ మీద రుణాలు తీసుకున్న కొందరు బ్యాంకుకు ఈఎమ్ఐలు చెల్లించలేదని వెలుగు చూసింది. గతంలో ఈ బ్యాంకులో పని చేసిన లేడీ మేనేజర్ సంధ్యా చేతి వాటం చూపించి లంచాలు తీసుకుని సుమిత్రా, లక్ష్మీ, విద్యావతి, పరమేశ్వరప్ప, మారప్ప, మాదర నాగమ్మ, ఆజాజ్ అహమ్మద్ షేక్ తదితరులకు రూ. 35 లక్షల రూపాయల రుణాలు ఇచ్చేసి చేతులు దులుపుకుందని వెలుగు చూసింది.

సంధ్యా మేడమ్ అరెస్టు
కొత్త బ్యాంకు మేనేజర్ కేసు పెట్టడంతో లేడీ బ్యాంకు మేనేజర్ సంధ్యాను హాసన్ లో హుబ్బళిలోని కేశ్వాపూర్ పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ఇంకా బ్యాంకులో ఎంత మొత్తంలో గోల్ మాల్ జరిగింది, ఇంకా ఎవరైనా ఇలా లోన్లు తీసుకున్నారా అని ఆరా తీస్తున్నామని హుబ్ళళి పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications