Lady: పిల్లలు లేరని ఆరాటం, 25 ఏళ్లు పెంచారు, పెంపుడు తల్లిని బాత్ రూమ్ లో చంపేసిన దత్తపుత్రుడు !

చెన్నై/ పుదుకోటై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పిల్లలు పుట్టకపోవడంతో దంపతులు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. పిల్లలు పుట్టరని తెలిసి బంధువుల అబ్బాయిని దత్తత తీసుకున్నారు. 25 ఏళ్లు దత్త పుత్రుడిని సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు. పెంపుడు కొడుకు ఏమి కావాలంటే అది తీసిస్తూ వచ్చారు. రెండు సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయాడు. కొంతకాలం పెంపుడు తల్లితో కలిసి ఉన్న పెంపుడు కొడుకు తరువాత సిటీకి వెళ్లిపోయాడు. నెలలో కొన్ని రోజులు ఇంటికి వెలుతున్నాడు. నాలుగు రోజుల క్రితం పెంపుడు కొడుకు ఇంటికి వెళ్లి అక్కడే ఉన్నాడు. పెంపుడు తల్లి బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే ఇనుపరాడ్ తో కొట్టి ఆమెను దారుణంగా హత్య చేసిన పెంపుడు కొడుకు పారిపోవడం కలకలం రేపింది.

 దంపతులకు పిల్లలు లేరు

దంపతులకు పిల్లలు లేరు

తమిళనాడులోని పుదుకోటై నగరంలోని అందకులం రోడ్డు సమీపంలోని రసపట్టిలో చెన్నాచ్చి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 30 ఏళ్ల క్రితం చెన్నాచ్చి వీరమ్మాళ్ (47) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న చెన్నాచ్చి, వీరమ్మాళ్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పిల్లలు పుట్టకపోవడంతో చెన్నాచ్చి, వీరమ్మాళ్ దంపతులు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

 గారాభంగా పెరిగిన దత్తపుత్రుడు

గారాభంగా పెరిగిన దత్తపుత్రుడు

పిల్లలు పుట్టరని తెలిసుకున్న చెన్నాచ్చి, వీరమ్మాళ్ దంపతులు వారి బంధువుల అబ్బాయి సెల్వరాజ్ ను దత్తత తీసుకున్నారు. 25 ఏళ్లు దత్త పుత్రుడు సెల్వరాజ్ ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు. పెంపుడు కొడుకు సెల్వరాజ్ కు ప్రస్తుతం 27 సంవత్సరాల వయసు. చెన్నాచ్చి, వీరమ్మాళ్ దంపతులు వారి దత్త పుత్రుడు సెల్వరాజ్ ఏమి కావాలంటే అది తీసిస్తూ వచ్చారు.

 భర్త చనిపోయాడు

భర్త చనిపోయాడు

రెండు సంవత్సరాల క్రితం వీరమ్మాళ్ భర్త చెన్నాచ్చి అనారోగ్యంతో చనిపోయాడు. భర్త చెన్నాచ్చి చనిపోవడంతో వీరమ్మాళ్ ఆమె దత్తపుత్రుడు సెల్వరాజ్ తో కలిసి సొంత ఇంట్లో ఉంటున్నది. గత ఏడాది సెల్వరాజ్ చెన్నై వెళ్లి కారు తీసుకుని నడుపుకుంటూ డబ్బులు సంపాధిస్తూ అక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు.

 పెంపుడు తల్లిని టార్చర్ పెడుతున్న దత్తపుత్రుడు

పెంపుడు తల్లిని టార్చర్ పెడుతున్న దత్తపుత్రుడు

సెల్వరాజ్ నెలలో కొన్ని రోజులు ఇంటికి వెలుతున్నాడు. ఊరికి వెళ్లిన ప్రతిసారి సెల్వరాజ్ పెంపుడు తల్లి వీరమ్మాళ్ దగ్గర వేలు వేలు డబ్బులు లాక్కొని వెలుతున్నాడని తెలిసింది. నాలుగు రోజుల క్రితం వీరమ్మాళ్ పెంపుడు కొడుకు సెల్వరాజ్ ఆమె ఇంటికి వెళ్లి అక్కడే ఉన్నాడు. ఇంటికి వెళ్లిన సెల్వరాజ్ పెంపుడు తల్లి వీరమ్మాళ్ ను డబ్బులు ఇవ్వాలని అడిగాడు.

 పెంపుడు తల్లిని బాత్ రూమ్ లో చంపేసిన దత్తపుత్రుడు

పెంపుడు తల్లిని బాత్ రూమ్ లో చంపేసిన దత్తపుత్రుడు

డబ్బులు ఇవ్వడానికి వీరమ్మాళ్ నిరాకరించిందని తెలిసింది. మరుసటి రోజు వీరమ్మాళ్ బాత్ రూమ్ లో స్నానం చేస్తుంటే ఇనుపరాడ్ తో కొట్టి ఆమెను దారుణంగా హత్య చేసిన పెంపుడు కొడుకు సెల్వరాజ్ పారిపోయాడు, సాయంత్రం బంధువులు వెళ్లి చూడగా వీరమ్మాళ్ హత్యకు గురైన విషయం వెలుగు చూడటంతో కలకలం రేపింది. పెంపుడు తల్లి వీరమ్మాళ్ ను హత్య చేసిన సెల్వరాజ్ కోసం గాలిస్తున్నామనిప పుదుకోటై పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+