Lady: కూతురి కళ్లముందే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న టీచర్ భార్య, డెత్ నోట్ లో ఏం రాసిదంటే ? !
బెంగళూరు/మండ్య/మైసూరు: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. దంపతులు సంతోషంగా ఉంటున్నారని బంధువులు, వాళ్లకు తెలిసిన వాళ్లు అందరూ అంటున్నారు. మూడు రోజుల క్రితం ఏడాది వయసు ఉన్న కూతురి బర్త్ డే వేడుకులు గ్రాండ్ గా చేశారు. ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లాడు. పెద్ద కొడుకు అతని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో ఏడాది కూతురితో కొన్ని గంటలు కాలం గడిపిన మహిళ తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె డెత్ నోట్ రాసింది. ఏడాది వయసు ఉన్న కూతురి కళ్ల ముందే ఉరి వేసుకున్న ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
బెంగళూరు నగర శివార్లలోని కనకపురలో కవితా (36) అనే మహిళ నివాసం ఉండేది. బెంగళూరులో నివాసం ఉంటున్న రవికుమార్ అనే వ్యక్తితో 9 సంవత్సరాల క్రితం కవితా పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న రవికుమార్, కవితా దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. రవికుమార్, కవితా దంపతులకు 7 సంవత్సరాల వయసు ఉన్న కొడుకు, ఏడాది వయసు ఉన్న కూతురు ఉన్నారు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్త
రవికుమార్ ప్రభుత్వ స్కూల్ లో పీటీ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు బెంగళూరులో ఉద్యోగం చేసిన రవికుమార్ నాలుగు సంవత్సరాల క్రితం మైసూరుకు బదిలి అయ్యాడు. మైసూరులో ఇంతకాలం ఉద్యోగం చేసిన రవికుమార్ మూడు నెలల క్రితమే మండ్య పట్టణంలోని ప్రభుత్వ స్కూల్ కు బదిలి అయ్యాడు.

మూడు రోజుల క్రితం కూతురి బర్త్ డే పార్టీ
మూడు ెలల నుంచి మండ్యలోని కెంపేగౌడ లేఔట్ లో రవికుమార్, కవితా దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం బంధువులు, స్థానికులను పిలిచి కూతురి బర్త్ డే పార్టీ గ్రాండ్ గా చేశారు. వారం రోజుల క్రితం స్కూల్స్ ప్రారంభం కావడంతో రవికుమార్ రోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు.

కూతురి కళ్ల ముందే ఉరి వేసుకున్న మహిళ
ఉదయం రవికుమార్ స్కూల్ కు వెళ్లాడు. రవికుమార్ పెద్ద కొడుకు అతని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో ఏడాది కూతురితో కొన్ని గంటలు కాలం గడిపిన కవితా ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడింది. తరువాత మద్యాహ్నం హాల్ లో ఫ్యాన్ కు కవితా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

డెత్ నోట్ రాసిన మహిళ
కవితా ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టింది. నేను కష్టపడి బంగారు నగలు కొనుక్కున్నాను, నా బంగారు నగలు మొత్తం ఏడాది వయసు ఉన్న నా కూతురికి ఇవ్వాలి, నగలు వేరే వాళ్లకు ఇస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు, ఈ లోకంలో నాకు ఇదే చివరికి రోజు అంటూ కవితా డెత్ నోట్ రాసిందని పోలీసులు అన్నారు.

పాప ఏడుపుతో విషయం వెలుగు చూసింది
కవితా ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆకలితో ఏడాది వయసు ఉన్న పాప పదేపదే ఎడ్చింది. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూడగా కవితా ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసిందని పోలీసులు అన్నారు. ఏడాది వయసు ఉన్న కూతురి కళ్ల ముందే కవితా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications