లఖీంపూర్ ఖేరీ: ‘రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్

లఖీంపూర్ ఖేరీ టికునియాలో రైతులను జీపుతో తొక్కించి చంపిన కేసులో హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను లఖీంపూర్ ఖేరీ పోలీసులు అరెస్ట్ చేశారు.
శనివారం సుమారు 12 గంటల విచారణ తర్వాత పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
"ఆశిష్ మిశ్రా కొన్ని గంటల విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవాలని ప్రయత్నించారు. మాకు సహకరించలేదు. దాంతో ఆయన్ను అరెస్ట్ చేయబోతున్నాం. కస్టడీ కోసం మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెడతాం" అని డీఐజీ ఉపేంద్ర అగ్రవాల్ మీడియాకు సమాచారం ఇచ్చారు.
లఖీంపూర్ ఖేరీ టికునియాలో రైతుల హత్య కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఆయనపై హత్య, నేరపూరిత హత్య, హత్యకు కుట్రతోపాటూ మరికొన్ని కఠిన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.
అరెస్ట్ తర్వాత ఆశిష్ మిశ్రాకు మెడికల్ పరీక్షలు చేయిస్తారు. శనివారం ఉదయం 10.40కి ఆశిష్ మిశ్రా లఖీంపూర్ ఖేరీ పోలీసుల ఎదుట తన వాదన వినిపించడానికి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి:
- 'ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో పోలీసుల కుమ్మక్కు.. ఇదో కొత్త ట్రెండ్, దీన్ని ఆపాలి’ అని సీజేఐ జస్టిస్ రమణ ఎందుకు అన్నారు?
- ఆర్యన్ ఖాన్: సముద్రంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమారుడిని ఎలా పట్టుకున్నారంటే..
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- రెండవ ప్రపంచ యుద్ధం: ఈ చిన్న పడవలో నాజీల నుంచి ఆ సోదరులు ఎలా తప్పించుకున్నారు?
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?
- అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications