వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానికి పాకిన అల్లర్లు: పోలీస్ జీపునకు నిప్పు: మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలకు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు రాజధాని లక్నో వరకూ పాకాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారు కింద పడి నలుగురు రైతులు దుర్మరణం పాలు కావడం, ఆ తరువాత చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో మరో నలుగురు మృతి చెందడంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. లఖింపూర్ ఖేరిలో పలుచోట్ల 144 సెక్షన్‌ను విధించారు పోలీసులు.

నేతల హౌస్ అరెస్ట్..

బయటి వ్యక్తులెవరూ ఎవరూ లఖింపూర్‌లోకి రాకుండా ఉండేలా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. రాజకీయ నాయకులను పోలీసులు వెళ్లనివ్వట్లేదు. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. లఖింపూర్‌ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల్లో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ చర్యలు మరింత ఉద్రిక్తతలకు కారణం అయ్యాయి.

కాంగ్రెస్, ఎస్పీ సహా..

అరెస్టయిన వారిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధులు, ఉపాధ్యక్షులను పోలీసులు అరెస్ట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిని గృహ నిర్బంధంలో ఉంచారు. సమాజ్ వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

తొలుత హౌస్ అరెస్ట్..


రాజధాని లక్నోలోని గులిస్తాన్ కాలనీ, విక్రమాదిత్య మార్గ్‌లో అఖిలేష్ యాదవ్ నివాసం ఉంటోన్నారు. ఆయన నివాసానికి దారి తీసే మార్గాలన్నింటినీ పోలీసులు మూసివేశారు. బ్లాక్ చేశారు. వాహనాలను అడ్డుగా పెట్టారు. భారీ వాహనాలను సైతం ఎక్కడిక్కడ అడ్డుగా పెట్టారు. కొత్త వారెవరూ ఆయన నివాసానికి చేరుకోకుండా.. బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు అందేంత వరకూ అఖిలేష్ యాదవ్ గృహ నిర్బంధంలో కొనసాగుతారని లక్నో పోలీసులు స్పష్టం చేశారు.

వందలాదిమందిగా..


తనను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని నిరసిస్తూ అఖిలేష్ యాదవ్.. ఇంటి వద్దే బైఠాయించారు. సమాజ్‌వాది పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. అఖిలేష్ యాదవ్‌కు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. లఖింపూర్ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనలన్నింటికీ కారణమైన కేంద్ర హోం శాఖ సహాయమ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశీష్ మిశ్రాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

రెండు కోట్ల పరిహారం..

లఖింపూర్ ఉదంతంలో దుర్మరణం పాలైన ఎనిమిది మంది రైతు కుటుంబాలకు రెండు కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. బ్రిటీషర్ల హయాంలోనూ ఇంతటి దమనకాండను చూడలేదని ఆయన మండిపడ్డారు. రైతులను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎంతగా అణచివేస్తోందో.. లఖింపూర్ ఉదంతం స్పష్టం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏడాదికాలంగా నిద్రాహారాలు మాని ఆందోళనలు చేస్తోన్న రైతులను కారుతో తొక్కించి చంపే స్థాయికి దిగజారిందని ఆరోపించారు.

అఖిలేష్ అరెస్ట్..

అఖిలేష్ అరెస్ట్..

అఖిలేష్ యాదవ్ రోడ్డుపై బైఠాయించడం, వందలాదిమంది సమాజ్ వాది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకోవడం వంటి పరిణామాలో లక్నోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాటిని నివారించడంలో భాగంగా పోలీసులు అఖిలేష్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన ప్రదర్శనలను చేస్తోంటే.. యోగి సర్కార్ పోలీసులను తమపై ప్రయోగించిందని ఎస్పీ నాయకులు విమర్శించారు.

పోలీస్ జీపు దగ్ధం

పోలీస్ జీపు దగ్ధం

అఖిలేష్ యాదవ్ నివాసానికి కొద్ది దూరంలో ఓ పోలీస్ జీపు దగ్ధం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో జీపు మొత్తం దగ్ధమైంది. లఖింపూర్ ఖేరి ఘటనకు నిరసన తెలియజేయడానికి రాజధాని లక్నోలో ఆందోళన ప్రదర్శనలను చేపట్టిన వారే ఈ ఘటనకు కారణమై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ నివాసం వద్ద బందోబస్తు కోసం వచ్చిన పోలీసులకు సంబంధించిన జీపు అది. ఈ ఘటనకు పాల్పడిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తోన్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నారు.

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా..

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా..

లఖింపూర్ ఖేరి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారును అడ్డుకుని, తమ నిరసన తెలియజేయడానికి రైతులు ప్రయత్నించారు. మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఏడాదికాలంగా రైతులు చేస్తోన్న నిరసన దీక్షలకు కొనసాగింపుగా భారత్ కిసాన్ యూనియన్ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రమంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకుని, మూడు వ్యవసాయ చట్టాల పట్ల తమకు నిరసనలను తెలియజేయాలనేది వారి ఉద్దేశం.

Recommended Video

పెరిగిన నిత్యవసర సరుకులపై కార్యాచరణ ప్రకటించిన టీపిసిసి మహిళా నేత సునిత రావు
రైతులపై దూసుకెళ్లిన కారు..

రైతులపై దూసుకెళ్లిన కారు..


అడ్డుకున్న రైతులు..

లఖింపూర్ ఖేరి.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా సొంత లోక్‌సభ నియోజకవర్గం. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచే గెలుపొందారు. తన నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చిన ఆయనను రైతులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తోన్న కారుకు అడ్డుగా కూర్చున్నారు. అయినప్పటికీ- లెక్క చేయలేదని, కారును రైతుల మీదుగా పోనిచ్చారనే ఆరోపణలు అజయ్ మిశ్రాపై ఉన్నాయి. ధర్నా చేస్తోన్న రైతులపై కారును పోనివ్వడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

English summary
Police take Samajwadi Party president Akhilesh Yadav into custody outside his residence where he staged a sit-in protest after being stopped from going to Lakhimpur Kheri where 8 people died in violence yesterday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X