హైదరాబాద్ లో దారుణం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి..
వేసవిలో మామిడిపండ్లు విరివిగా దొరుకుతుంటాయి. బయట మార్కెట్లలో, రోడ్డు పక్కన ఎక్కడ చూసినా తాజాగా నిగనిగలాడుతూ మామిడి పండ్లు కనిపిస్తుంటాయి. వాటిని చూస్తే కొనుక్కుని తినేయాలని అనిపిస్తుంది. కానీ ఆ మామిడి పండ్లు సహజంగానే పండినవేనా..? లేక కెమికల్స్ తో పండించారా..? అనే అనుమానం వస్తుంటుంది. తాజాగా హైదరాబాద్ లోని నారాయణగూడ ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. తల్లి మరో ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతులను భువనేశ్వరి (17), సంధ్య (10)గా గుర్తించారు. మామిడిపండ్లలో విష పదార్థాల ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఇంటికి పక్కన ఉన్న ఓ దుకాణం నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఆ కుటుంబం తిన్నది.

అయితే మరుసటి రోజు నుంచి వారికి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఇద్దరూ మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications