క్రిస్పీ మసాలా 'ఎగ్ టోస్ట్'.. ఇలా ఈజీగా చేసుకోండి..!
గుడ్డు సంపూర్ణ పోషకాహారం అని వైద్యులు చెబుతారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారంలో గుడ్డు ఒకటని తెలిసిందే. గుడ్డను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.. ఒక గుడ్డులో 5 గ్రాముల కొవ్వు, 6-7 గ్రాముల ప్రొటీన్ తోపాటు అనేక విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుడ్డును ఒకే రకంగా తీసుకుని బోర్ కొట్టిందా..? అయితే ఈ క్రిస్పీ మసాలా 'ఎగ్ టోస్ట్' ను తయారు చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలని అంటారు. మరి ఈ టేస్టీ 'ఎగ్ టోస్ట్' ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
క్రిస్పీ మాసాలా ఎగ్ టోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే బ్రెడ్ స్తెసెస్ రెండు, గుడ్లు రెండు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కొన్ని, పచ్చిమిర్చి కొన్ని, ఉప్పు రుచికి సరిపడా, కారం తగినంత, పసుపు తగినంత, కొత్తిమీర రుచికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు క్రిస్పీ మసాలా ఎగ్ టోస్ట్ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో గుడ్లు కొట్టి పోయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి బాగా గిలకొట్టుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో బ్రెడ్ ముక్కల్ని బాగా ముంచాలి. అలా ముంచిన తర్వాత ఎయిర్ ప్రయ్యర్ బాస్కెట్ ను కొద్దిగా నూనెతో గ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను బాస్కెట్ లో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఎయిర్ ప్రయ్యర్ ను 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉంచి అలా 7 నుంచి 8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ క్రిస్పీ మసాలా ఎగ్ టోస్ట్ రెడీ అయినట్టే.. ఇప్పుడు ఎగ్ టోస్ట్ ను చట్నీ లేదా కెచప్ తో సర్వింగ్ చేసుకోండి.. కేవలం 10 నిమిషాల్లోనే ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెడీ అవుతుంది. ఓ సారి మీరు కూడా ట్రై చేయండి..












Click it and Unblock the Notifications