లఖింపూరిఖేరి హింస: కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. శనివారం దాదాపు 12 గంటల విచారణ అనంతరం రాత్రి ఆశిష్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఆదివారం కోర్టులకు సెలవు కావడంతో రాత్రే జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అంతకుముందు ఆయనకు క్రైం బ్రాంచ్ కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆశిష్ మిశ్రాను పోలీసుల రిమాండుకు అనుమతించాలని కోరుతూ న్యాయమూర్తికి దరఖాస్తు సమర్పించామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌పీ యాదవ్ తెలిపారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.
అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలో నిందితుడిగా ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతి చెందారు. రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఆశిష్ మిశ్రా పేరును పోలీసులు చేర్చారు. శనివారం క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట ఆశిష్ హాజరయ్యారు.

మరోవైపు, లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ రామ్ నాథ్ కోవింద్‌కు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌కు తాజాగా లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ ఛౌదురి రాష్ట్రపతిని కలువనున్నారు.
లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కారణమంటూ రైతులు, ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఆశిష్ మిశ్రతోపాటు ఆయన అనుచరులు స్వయంగా వాహనం నడుపుకుంటూ తమపైకి దూసుకొచ్చినట్లు రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ నిందితులతోపాటు కేంద్ర మంత్రిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు' అని రాష్ట్రపతి భవన్‌కు రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
Recommended Video
ఈ నేపథ్యంలో లఖింపుర్ హింసకు సంబంధించిన వాస్తవాలతో కూడిన పూర్తి సమాచారాన్ని రాష్ట్రపతి ముందుంచేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ను కోరింది. మరోవైపు, లఖింపూర్ ఖేరి ఘటనను ఇరువర్గాల మధ్య ఘర్షణ చిత్రీకరించడంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటివి అనైతికమని, చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. గాయాన్ని పెద్దది చేసే ప్రయత్నాలు మానుకోవాలని వరుణ్ గాంధీ హితవు పలికారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications