యూపీలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్ గూటికి లాల్ బహుదూర్ శాస్త్రి కుమారుడు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కమలానికి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్ర సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. యూపీలో కాంగ్రెస్ దే గెలుపని సునీల్ శాస్త్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హస్తం గూటికి సునీల్ శాస్త్రి
యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీలు తమ దూకుడును మరింత పెంచాయి. ఒకరిపై మరొకరు మాటలతో దుమ్మెత్తెపోసుకుంటున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మరోవైపు రాహుల్ గాంధీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహన్ని నింపుతున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఆపార్టీకి మరింత ఊపునిస్తోంది. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకోని భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి గూటికి చేరారు. ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఇద్దరం కలిసి పోరాడదాం.. గెలుపు మనదే..
సునిల్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీలో చేరికను ప్రియాంక గాంధీ తన ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సైనికుడు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రిని కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం రోజు కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇద్దరం కలిసి ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు తెలిపారు. యూపీలో ఇద్దరు కలిసి పోరాడుతామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కు బూస్ట్..
సునీల్ శాస్త్రి కాంగ్రెస్‌లో చేరికతో యూపీలో కాంగ్రెస్ పార్టీకి కాస్త బూస్ట్ దొరికినట్టైంది. ఇప్పటికే యోగి సర్కార్ పై ప్రజాల్లో వ్యతిరేక వ్యక్తం అవుతోంది. ఇటీవల కేంద్ర మంత్రి కొడుడు రైతులపై కారు ఎక్కించిన ఘటనతో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. కొందరు కమలం నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా సునీల్ శాస్త్రి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సునీల్ శాస్త్రి గతంలో ఉత్తరప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్న శాస్త్రి కుటుంబం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆపార్టీకి మరింత లాభం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మోదీపై సోనియా ఫైర్
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విరుచుపడ్డారు. దేశంలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మౌనం వహించదన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని స్పష్టం చేశారు సోనియా గాంధీ. పూర్తవైభవాన్ని తీసుకువస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications