పగలంతా అబ్బాయిలా.. రాత్రయితే అమ్మాయిలా?: ఇదీ ఓ యువకుడి ఆవేదన..

Subscribe to Oneindia Telugu

పాట్నా: చేతిలో ఉన్న డిగ్రీతో ఉద్యోగం రాని పరిస్థితి.. ఉన్న ప్రతిభతో కళకు అంకితమైతే అందులోను అవహేళనకు గురవుతున్న దుస్థితి. నిరుపేద కుటుంబం.. రాత్రికి వేషం కట్టకపోతే.. మరుసటి రోజు తిండి కూడా దొరకని నేపథ్యం.

దీంతో కళ తనకు తిండి పెడుతోందని సంతోషపడాలా?, కనీసం దాన్నో కళ అని కూడా గుర్తించని చోట.. కేవలం తిండి కోసమే జీవితమంతా అందులోనే కొనసాగాలా? అన్న ప్రశ్నలు అతన్ని వెంటాడుతున్నాయి.

  Chalo Assembly : చలో అసెంబ్లీకి అడ్డుకట్ట | Oneindia Telugu

  అతనే బీహార్ లోని పాట్నాకు చెందిన లలిత్ కుమార్. డిగ్రీ పూర్తి చేసిన లలిత్.. పోటీ పరీక్షల కోసం ఓ కోచింగ్ సెంటర్ లో చేరాడు. పగలంతా ఉద్యోగం కోసం కోచింగ్ సెంటర్ లో.. పొట్టకూటి కోసం రాత్రి వేళల్లో ఆడవేషంలో.. లలిత్ కుమార్ బతుకుపోరాటం ఇది. బీహార్ లో అంతరించిపోతున్న సాంప్రదాయంలో లోండా కళ ఒకటి.

  lalit kumar as woman in londa art

  ఇందులో మగవాళ్లే ఆడవేషం ధరించి నృత్యం చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో లలిత్ కూడా లోండా వృత్తిలోకి దిగాడు. ముందు నుంచి బాగా పాటలు పాడే లలిత్.. ఆడవేషంలో తన చాలామందిని ఆకట్టుకున్నాడు. అలా లలిత్ ప్రదర్శన చూసేందుకు చాలామంది మగవాళ్లు వస్తుంటారు.

  అయితే రాను రాను ఈ కళ అంతరించిపోతుండటం.. తన ప్రతిభకు సరైన గుర్తింపు దక్కకపోతుండటంతో లలిత్ ఆవేదన చెందుతున్నాడు. కళాకారుడిగా కొంతమంది తనను గౌరవిస్తుంటే.. ఆడవేషం కట్టినందుకు కొంతమంది తనను హేళన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నాడు. రోజురోజుకు ఈ అవమానాలు ఎక్కువవుతుండటంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు.

  త్వరగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ప్రత్యేక గుర్తింపు పొందాలనేది తన కోరిక అని లలిత్ చెబుతున్నాడు. ఇదే వృత్తిలో కొనసాగుతున్న మరికొందరు కూడా తాము చాలా అవమానాలను ఎదుర్కొంటున్నామని అన్నారు. కళనే నమ్ముకున్న తమను చాలామంది బానిసల్లా చూస్తోందని లోండా జీవితం నుంచి బయటకు వచ్చిన బనారసి లాల్‌ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Lalit Kumar, Artist of Londa was facing troubles to continue in that.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి