వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మతో ప్యామిలీ రిలేషన్: లలిత్, బ్రిటన్ స్పందన

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తనకు కుటుంబ సంబధాలు ఉన్నాయని ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ చెప్పారు. బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్ రాయడంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తనకు మద్దతిచ్చారని తెలిపారు.

సుష్మ భర్త, కుమార్తె తనకు ఉచితంగా న్యాయసేవలు అందించేవారని చెప్పారు. బాల్కన్ దేశమైన మోంటెనెగ్రోలో విహారయాత్రలో ఉన్న లలిత్ మోడీ ఓ ఆంగ్ల టీవీ ఛానల్ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు.

రెండేళ్ల క్రితం తన భార్యకు పోర్చుగీస్‌లో క్యాన్సర్ చికిత్స చేయించానని, అప్పట్లో ఆమెకు తోడుగా వసుంధరా రాజే వచ్చారని, వసుంధరతో 30 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని, ఆ బంధం గురించి అందరికీ తెలుసునని చెప్పారు.

తన కేసులో సాక్షిగా ఉండేందుకు కూడా ఆమె అంగీకరించారని, కేసు విచారణకు వచ్చేసరికి దురదృష్టం కొద్దీ ఆమె ముఖ్యమంత్రిగా ఉండటంతో సాక్షిగా రాలేకపోయారని, తన భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు సుష్మా, వసుంధర ఎంతో మద్దతిచ్చారని చెప్పారు. నేను ఎంతోమంది రాజకీయవేత్తలతో స్నేహంగా ఉంటానన్నారు.
వసుంధర రాజే మాట్లాడుతూ.. తనకు లలిత్ మోడీ కుటుంబం తెలుసునని చెప్పారు.

Lalit Modi admits closeness to Sushma, Vasundhara

సుష్మ రాజీనామా చేయరు

విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇరువురు సీనియర్ మంత్రులు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుష్మాస్వరాజ్ మావతా దృక్పథంతో మాత్రమే లలిత్ మోడీకి సహాయం చేసారన్నారు.

సుష్మా స్వరాజ్ తీసుకున్న నిర్ణయం గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఏ మంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా అది సమిష్టి నిర్ణయం అవుతుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. లలిత్‌పై మొత్తం పదిహేడు కేసులున్నాయని, వీటికి సంబంధించి పదహారు కేసుల్లో ఆయనకు నోటీసులు జారీ చేయటం జరిగిందని జైట్లీ వివరించారు.

సుష్మాస్వరాజ్ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీలు కూడా లలిత్ మోడీ బ్రిటీష్ వీసా పొందడానికి సాయం చేయడంలో సుష్మాస్వరాజ్ ఏ తప్పూ చేయలేదంటూ ఆమెను వెనకేసుకు వచ్చారు. కేవలం మానవతా దృక్పథంతోనే ఆమె చేశారన్నారు.

కాంగ్రెస్ పార్టీ సుష్మపైన, ప్రధానిపైన చేస్తున్న విమర్శలన్నీ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నవేనని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాన్ని సృష్టించారని వారంటూ సుష్మకు ప్రభుత్వం, పార్టీ పూర్తి మద్దతు ఇన్నాయన్నారు.

అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉందని, అందుకే అనవసర విషయాలను సమస్య చేయడానికి అది ప్రయత్నిస్తోందన్నారు. లలిత్ మోడీకి వీసా మంజూరు చేస్తే భారత ప్రభుత్వానికి ఏమయినా అభ్యంతరం ఉందా అని బ్రిటీష్ అధికారులు అడిగితే, నిబంధనలు అనుమతిస్తే లలిత్ మోడీకి వీసా ఇచ్చే విషయాన్ని బ్రిటీష్ ప్రభుత్వం పరిశీలించవచ్చని మాత్రమే ఆమె చెప్పారని అన్నారు.

నిబంధనల ప్రకారమే చేశాం: యూకే

లలిద్ మోడీ ప్రయాణ పత్రాల ఉదంతంలో తాము పూర్తిగా నిబంధనల ప్రకారమే చేశామని యూకే స్పష్టం చేసింది. మరోవైపు సుష్మ పైన వచ్చిన ఆరోపణల పైన విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాఫ్తు జరపాలన్నారు.

English summary
IPL's controversial former chief Lalit Modi on Tuesday admitted close relations with Rajasthan Chief Minister Vasundhara Raje and External Affairs Minister Sushma Swaraj, and said he has been "over criticised" and "taken to task" by the former UPA government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X