లలిత్‌గేట్: 'లండన్‌లో ప్రియాంక- వాద్రాలను కలిశా'

న్యూఢిల్లీ: 'సినిమా ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు' అని రెండు రోజుల క్రితం ఐపీఎల్ మాజ్ ఛైర్మన్ లలిత్ మోడీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే రాజకీయనాయకులకు చుక్కులు చూపిస్తున్నాడు. ట్విట్టర్ ద్వారా ఎవరినెప్పుడు టార్గెట్ చేస్తాడోనని భయపడి చస్తున్నారు.

ఎవరెవరు తనను కలిసింది, ఎక్కడ సమావేశమైంది తదితర విషయాలను ట్విట్టర్‌లో వెల్లడిస్తోన్న లలిత్ మోడీ తాజాగా మరో ట్వీట్ చేశాడు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రాలను తాను కలుసుకున్నానని లలిత్ మోడీ పేర్కొన్నాడు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా తాను భేటీ అయ్యానని తెలిపాడు. గతేడాది లండన్‌లో ఆ ముగ్గురితో సమావేశం అయ్యానని తెలిపిన లలిత్ మోడీ ఆ సమయంలో దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తు చేశాడు.

ఆనాటి సమావేశం గురించి ఆ ముగ్గురు వ్యక్తులు ఎందుకు బయట పెట్టలేదని, వారితో నేను సమాశమైతే ఎందుకు అనుమానం రాలేదని ప్రశ్నించాడు. ఆ ముగ్గురిని నేను రెస్టారెంట్‌లో కలుసుకున్నప్పుడు వారితో పాటు టిమ్మీ సర్నా ఉన్నాడని, అతడి వద్ద నా కాంటాక్ట్ నెంబర్ ఉందన్నాడు.

అతడికి కాల్ చేస్తే ఆరోజు సమావేశంలో మేం ఏమేమి మాట్లాడుకున్నామో తెలుస్తుందని తన వరుస ట్వీట్స్‌లో రెండో ట్వీట్‌గా పేర్కొన్నాడు. లలిత్ మోడీ తన ట్వట్టర్‌లో పేర్కొన్న టిమ్మీ సర్నా రాబర్ట్ వాద్రాకు చెందిన డీఎల్ఎఫ్ బ్రాండ్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్వవహారిస్తున్నారు.

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీని విదేశాలకు పంపేందుకు సహకరించారనే ఆరోపణలతో రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మీడియా చీఫ్ రనదీప్ సుర్జేవాలా స్పందించారు.

ఐపీల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ, లండన్‌లో ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలను కలవడం పెద్ద నేరమేమి కాదన్నారు. ఆర్ధిక ఆరోపణలు ఉన్న లలిత్ మోడీపై యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మోడీని చట్టం నిలబెట్టే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని అన్నారు.

ఓ అపరాధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు సాయం చేసిందో ప్రధాని నరేంద్రమోడీ తన మౌనాన్ని వీడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+