బంద్: బీహార్‌లో లాలూ అరెస్ట్, స్తంభించిన ట్రాఫిక్
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పాట్నాలోని డాక్ బంగ్లా క్రాసింగ్ వద్ద లాలూని అరెస్టు చేశామని, ఆయనతో పాటు మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, వందలాది పార్టీ నాయకులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
బీహార్ మిలటరీ పోలీస్ క్యాంప్ వద్ద గల తాత్కాలిక శిబిరానికి లాలూను తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మండల్ (వెనకబడిన తరగతుల వాళ్లు) కమండలాన్ని (బీజేపీ) కూకటివేళ్లతో పెకలించాలని లాలూ ఒకరోజు బంద్‌కు అంతకుముందు పిలుపునిచ్చారు.

కులాల ఆధారంగా జరిగిన జనాభా లెక్కలను వెంటనే బయట పెట్టకపోతే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1990ల్లో జరిగిన మండల్ ఉద్యమం కంటే మరింత ఉధృతంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆర్జేడీ బంద్ కారణంగా బీహార్‌లో రైలు, రవాణా వ్యవస్ధను పూర్తిగా స్తంభింపజేశారు.












Click it and Unblock the Notifications