రైల్వే టెండర్ అక్రమాల కేసు: సిబిఐ విచారణకు లాలూ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు.రైల్వే హోటళ్ల టెండర్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న లాలూను గురువారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. రైల్వే హోటళ్ల టెండర్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న లాలూను గురువారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు.
లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఓ రైల్వే హోటల్ టెండర్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా విచారణ జరుగుతోంది.

ఈ కేసులో లాలూ తనయుడు తేజస్వీ పైనా ఆరోపణలున్నాయి. గత నెల 10, 11 తేదీల్లో వీరిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు లాలును మరోసారి పిలిచారు.












Click it and Unblock the Notifications