జైలు శిక్ష: తట్టుకోలేక లాలూ ప్రసాద్ యాదవ్ సోదరి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సోదరి గంగోత్రి దేవీ ఆదివారంనాడు మరణించారు. దాణా కుంభకోణం కేసులో అంతకు ముందు రోజే లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడింది.

లాలూ ప్రసాద్‌కు జైలు శిక్ష పడడాన్ని తట్టుకోలేక దిగ్బ్రాంతికి గురై ఆమె మరణించినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే లాలూ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి గంగోత్రి నివాసానికి చేరుకున్నారు.

Lalu’s sister dies of shock after his sentencing

లాలూకు శిక్ష పడకూడదని 73 ఏళ్ల గంగోత్రి గత కొద్ది రోజులుగా క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తోందని, ఆదివారం రోజంతా ప్రార్థనలు చేస్తూనే గడిపిందని, లాలూ త్వరగా విడుదల కావాలని ఆదివారంనాడు ఆమె పూజలు చేసిందని అన్నారు.

దిగ్భ్రాంతికి గురై తట్టుకోలేక గంగోత్రి మరణించిందని రబ్రీ దేవి విలపిస్తూ మీడియా ప్రతినిధులతో అన్నది. విషయం తెలిసిన వెంటనే లాలూ కుమారులు తేజస్వి, తేజ్ ప్రతాప్ ఆమెకు పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lalu Prasad's lone sister Gangotri Devi passed away on Sunday, a day after the RJD chief was sentenced to 3.5 years in jail in the fodder scam case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X