సీఎంగా కొడుకును తప్ప- ఇక్కడ క్యాస్ట్, ఫ్యామిలీ బేస్ట్ పాలిటిక్స్: షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్
Prashant Kishor: బిహార్ లో చోటు చేసుకుంటోన్న తాజా రాజకీయ పరిణామాలపై జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు. ఇంట్లో ఎవరిని బహిష్కరించినా, ఎవరిని స్వాగతించినా బిహార్ కు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో పట్టించుకోవడం మానేశారని ఎద్దేవా చేశారు. వైశాలిలో రోడ్ షో సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తన రెండో కుమారుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ ను ముఖ్యమంత్రిని చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ భావిస్తోన్నారని, అందుకే ఎవరూ అడ్డు లేకుండా జాగ్రత్త పడ్డారని వ్యాఖ్యానించారు.

తన కుటుంబం, తన కుమారుడు కాకుండా యాదవ సామాజికవర్గంలో మరో మంచి నాయకుడు ఉన్నాడని లాలూ ప్రసాద్ ఏనాడైనా చెప్పారా? అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. ఇప్పటికీ తేజస్వీ యాదవ్ ను మాత్రమే ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారని అన్నారు.
తేజస్వీని కాకుండా యాదవ సామాజిక వర్గం నుంచి మరో నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని లాలూ ప్రసాద్ ప్రకటిస్తే తాను ఆయనకు మద్దతు ఇస్తానని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కుటుంబం, కుల రాజకీయాలను నడిపిస్తోన్నాయని ఆయన విమర్శించారు. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కుటుంబం, కులం చుట్టే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాద్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆరు సంవత్సరాల పాటు కి చెందిన ఎలాంటి కార్యక్రమాలతో పాల్గొనకూడదని హెచ్చరించారు.
అక్కడితో ఆగలేదు. కుటుంబం నుంచి కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ ను వేలివేశారు. ఆయనతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
దీనికి గల కారణాలనూ వివరించారు లాలూ ప్రసాద్. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, వాటిని అవహేళన చేయడం, అవమాన పరిచేలా ప్రవర్తించడం ఏ మాత్రం ఉపేక్షించదలిచిన అంశం కాదని లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు. నైతిక విలువలను విస్మరించడం వల్ల సామాజిక న్యాయం కోసం సాగిస్తోన్న సమష్టి పోరాటం బలహీనపడుతుందని వ్యాఖ్యానించారు.
లాలూ ఇంత కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణాలు లేకపోలేదు. తరచూ తన గర్ల్ ఫ్రెండ్ అనూష్క యాదవ్ తో కలిసి తిరుగుతోండటం, ఆమెతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోండటమేనని చెబుతున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహితుడు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగ ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్ ను పెళ్లి చేసుకున్నారు తేజ్ ప్రతాప్. 2018లో వారిద్దరి వివాహం జరిగింది. ఇప్పుడు అనూష్క యాదవ్ తో సంబంధాలను కొనసాగిస్తోన్నాడాయన.
శనివారం ఆమెతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేశాడు. 12 సంవత్సరాలుగా ఆమెతో రిలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇది తీవ్ర వివాదానికి దారి తీయడంతో.. తన ఫేస్ బుక్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని తేజ్ ప్రతాప్ యాదవ్ వివరణ ఇచ్చాడు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications