వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడిగులను రెచ్చగొట్టిన శివసేన, మహారాష్ట్రలో కలిపేస్తాం, ఉద్దవ్ ఠాక్రే, కన్నడ, మరాఠీ చిచ్చు !

సరిహద్దులు ఉండేది భారతదేశానికి, శివసేనమరాఠీ బాషకు సరిహద్దులు లేవు, బెళగావిని మహారాష్ట్రలో కలిపేస్తాం కన్నడిగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, చిచ్చు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక సరిహద్దులోని మరాఠీ మాట్లాడే భూభాగం మహారాష్ట్రకు చెందినదని, త్వరలోనే సంయుక్త మహారాష్ట్ర ఏర్పాటు చేస్తామని శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికే కర్ణాటకలో మరాఠీ మాట్లాడే వారు నివాసం ఉంటున్న ప్రాంతాలు మహారాష్ట్రకే చెందుతాయని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు.

శుక్రవారం కర్ణాటక - మహారాష్ట్ర సరిహద్దులోని చందగడ తాలుకా, సిన్నోళ్ళి ప్రాంతం ( మహారాష్ట్ర రాష్ట్రం)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ బెళగావి, నిప్పాణి తో సహ మరాఠీ మాట్లాడుత్న ఆచుట్టుపక్కల ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపి వెయ్యడానికి శివసేన పోరాటం చేస్తుందని ఉద్దవ్ ఠాక్రే హామీ ఇచ్చారు.'

Land of Marathi in karnataka is belongs to Maharashtra says Shiv Sena Chief Uddhav Thackeray

సరిహద్దులు ఉండేది భారతదేశానికి మాత్రమేనని, మరాఠీ బాషకు కాదని ఉద్దవ్ ఠాక్రే కన్నడిగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. శివసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడి ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చెయ్యడానికి ఇక్కడ పోరాటం చేస్తున్న మరాఠీలకు అండగా ఉంటారని ఉద్దవ్ ఠాక్రే హామీ ఇచ్చారు.

ఆ సందర్బంలో కర్ణాటకకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. ఉద్దవ్ ఠాక్రే జిందాబాద్, మహారాష్ట్ర జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. బెళగావిలోని సాంబ్రా విమానాశ్రయంలో బెళగావి మేయర్ సోంజతా బాందేకర్, ఎంఇఎస్ నాయకులు ఉద్దవ్ ఠాక్రేని కలిశారు.

English summary
Land of Marathi in karnataka is belongs to Maharashtra says Siva Sena Chief Uddhav Thackeray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X