వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం తాజా ఆదేశాలు..! లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి వీటికి కూడా మినహాయింపు..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశం వినూత్న పద్దతులను అవలంభిస్తోంది. లాక్ డౌన్ పేరుతో దేశ ప్రజలందరిని ఇళ్లకే పరిమితం చేసిన కేంద్ర, రాష్ట్ర కరోనా వ్యాప్తి చెందకుడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు గత 34రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న తరుణంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20నుండి కొన్ని సంస్థలకు లాక్ డౌన్ ఆంక్షలనుండి మినహాయింపునిచ్చింది. అంతే కాకుండా నేడు తాజాగా మరికొన్ని రంగాలకు కూడా ఆంక్షలు సడలిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి మరికొన్నింటికి మినహాయింపు ఇస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.

Latest orders from the Center.!They are exempt from lockdown restrictions..!!

ఈ క్రమంలోనే విత్తనాలు, ఉద్యాన ఉత్పత్తులు, పరిశోధనా సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే స్కూల్ బుక్స్, ఎలక్ట్రానిక్ ఫ్యాన్స్‌కు సంబంధించిన షాపులు కూడా లాక్ డౌన్ నుంచి మినహాయించినట్లు స్పష్టం చేసింది. మరోవైపు పట్టణాల్లోని బ్రెడ్ ఫ్యాక్టరీలు, మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, బియ్యం మిల్లులు, పప్పు మిల్లులతో పాటు ప్రీపెయిడ్ మొబైళ్లకు రీచార్జ్ చేసే పాయింట్లకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆహార ఉత్పత్తుల తయారీ కేంద్రాలను మూసివేస్తే, ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉండటం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలాా ఉండగా కేంద్రం అమలు చేసిన లాక్ డౌన్ ఆంక్షలు మే 3 వరకు అమలులో ఉండగా, తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ ఆంక్షలు మే 7 వరకు కొనసాగనున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ఎటువంటి సడలింపులకు ఆస్కారం లేదని గతంలో ఇచ్చిన మార్గదర్శకాలే మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు సీఎం చంద్ర శేఖర్ రావు గతంలోనే స్పష్టం చేసిన అంశం తెలిసిందే.

Recommended Video

Fake News Buster : 11 ఉద్యోగుల జీతాల్లో కోత, క‌ప్ప‌ల‌ను తింటున్న చిన్నారులు...!!

English summary
The central government has exempted some companies from lockdown restrictions from this month. The Center said it is relaxing the rest of the sector today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X