Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమిలి ఎన్నికలు ! అఖిలపక్ష ప్రభుత్వాలు ? కీలక నిర్ణయాల దిశగా లా కమిషన్ ?

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణపై గతేడాది తీవ్రంగా చర్చ జరిగింది. ఓ దశలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని కూడా నియమించింది. అప్పటికే లా కమిషన్ ఇదే అంశంపై అధ్యయనం చేస్తోంది. దీంతో ఈసారి లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఇప్పుడు లా కమిషన్ దీనిపై కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమవుతోంది.

దేశంలో కేంద్రం ప్రతిపాదిస్తున్న ఒకే దేశం-ఒకే ఎన్నికల ఆలోచనను ముందుకు తీసుకెళ్లేలా జమిలి ఎన్నికల నిర్వహణకు లా కమిషన్ మొగ్గు చూపబోతున్నట్లు తెలుస్తోంది. అయితే 2024లో కాకుండా 2029లో ఈ జమిలి ఎన్నికల నిర్వహణకు లా కమిషన్ సిఫార్సు చేయబోతోంది. 2029 మధ్య నాటికి దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలని లా కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉందని సమాచారం.

Law commission to recommend simultaneous polls in 2029, unified governments, constitution amendments

రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ ఆధ్వర్యంలోని లా కమిషన్.. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ కూడా చేసేందుకు వీలుగా సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. 19వ లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న 2029 మే-జూన్‌లో తొలి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో శాసన సభల నిబంధనలను "మూడు దశల్లో" మార్చాలని కూడా కమిషన్ సిఫార్సు చేయనుంది. వీటిని కేంద్రం కూడా ఆమోదిస్తే ఎన్నికల కమిషన్ తదుపరి నిర్ణయాలు తీసుకుంటుంది.

రాజ్యాంగంలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, స్ధానిక సంస్ధల విషయంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. వీటిలో మార్పులు చేసేందుకు సవరణలు చేపట్టాలని లా కమిషన్ కేంద్రానికి సిఫార్సు చేయనుంది. వచ్చే ఐదేళ్లలో మూడు దశల్లో రాష్ట్రాల అసెంబ్లీల కాలాన్ని హేతుబద్దీకరించాలని సూచించనుంది. తొలిదశలో కమిషన్ మూడు లేదా ఆరు నెలల కాలవ్యవధిని కొన్ని నెలలు కుదించాల్సిన రాష్ట్రాల అసెంబ్లీల వ్యవహారం తేల్చనుంది. అలాగే అవిశ్వాసం, హంగ్ ఏర్పడినప్పుడు అఖిలపక్ష ప్రభుత్వాన్ని సిఫార్సు చేయనుంది. ఇది కుదరకపోతే మిగిలిన వ్యవధి కోసమే ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తుంది.

లా కమిషన్‌తో పాటు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కూడా రాజ్యాంగాన్ని, ప్రస్తుత చట్టపరమైన నిబంధనల్ని మార్చడం ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చనే దానిపై నివేదికను రూపొందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఏపీ, ఒడిశాతో సహా మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి.

మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. బీహార్, ఢిల్లీ అసెంబ్లీలకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళకు 2026లో జరుగుతాయి. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్‌లలో 2027లో ఎన్నికలు జరుగుతాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ వంటి తొమ్మిది రాష్ట్రాలలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+