Leader: రాత్రి వెళ్లిన పొలిటికల్ లీడర్ శవమైనాడు, వీడు ఫినిష్, జోబులో లెటర్ , ఏమైయ్యింది ?

బెంగళూరు/సింధనూరు: రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి అతనికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. గత ఎన్నికల్లో నమ్ముకున్న వాళ్లు ద్రోహం చెయ్యడంతో ఆ లీడర్ ఓడిపోయాడు. రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజకీయ నాయకుడు ఉదయం అయినా ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అతని కోసం గాలించడంతో ఊరి బయట అతను శవమై కనిపించాడు. ఆ లీడర్ జోబులో వీడు ఫినిష్ అనే లెటర్ చిక్కడం కలకలం రేపింది.

 రాజకీయ నాయకుడు

రాజకీయ నాయకుడు

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని సింధనూరు తాలుకాలోని గోరబళే గ్రామంలో శరణప్ప నందవాడిగె అలియాస్ శరణ (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ పార్టీలో చరుకుగా పని చేసిన శరణ ఆ ప్రాంతంలో అతనికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పార్టీలకు అతీతంగా అందరితో మంచితనంగా ఉండే శరణ వ్యవసాయం చేయిస్తున్నాడు.

 నమ్మక ద్రోహం ?

నమ్మక ద్రోహం ?

శరణకు వివాహం అయ్యి భార్య, కూతురు, కుమారుడు ఉన్నాడు. గత ఎన్నికల్లో గోరేబాళ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసిన శరణ విజయం సాధించాడు. శరణ అధికారంలో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి పని చేశాడని తెలిసింది. గత ఎన్నికల్లో నమ్ముకున్న వాళ్లు ద్రోహం చెయ్యడంతో పొలిటికల్ లీడర్ శరణ ఓడిపోయాడు.

 పంప్ సెట్ దగ్గర శవం... జోబులో వీడు ఫినిష్ అనే లెటర్

పంప్ సెట్ దగ్గర శవం... జోబులో వీడు ఫినిష్ అనే లెటర్

రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శరణ ఉదయం అయినా ఇంటికి రాలేదు. శరణ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అతని కోసం గాలించారు. ఊరి బయట శరణ పొలంలోని పంప్ సెట్ కు అతను ఉరి వేసుకున్న స్థితిలో వేలాడుతూ అతను శవమై కనిపించాడు. శరణలో జోబులో వీడు ఫినిష్ అనే లెటర్ చిక్కడం కలకలం రేపింది. శరణ ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా హత్య చేసి అతని జోబులో లెటర్ పెట్టారా ? అని సింధనూరు గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+