బాత్‌రూం పోనివ్వరా: చిటికెన వేలు చూపించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లోకసభలో విమర్శలతో పాటు చెణుకులు కూడా విసురుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పైన, ఆయన ప్రభుత్వం పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. మోడీ ఎవరి మాట వినడం లేదని ఆరోపించారు.
ఈ సమయంలో రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు బిజెపి తరఫున ఎంపీ ప్రహ్లాద్ జోషి తన సీటు పై నుంచి లేచారు. ఆ క్షణంలో రాహుల్ గాంధీ ఒక్కసారిగా ఆగకుండా తన సీటు నుంచి ముందుకు కదిలారు. ఆయన బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

దీంతో బిజెపి సభ్యులు అందరూ.. రాహుల్ గాంధీ సమాధానం చెప్పకుండా పారిపోతున్నారని ఆట పట్టించారు. అయితే రాహుల్ గాంధీ చిటికెన వేలు చూపిస్తూ బాత్ రూం వెళ్తున్నానంటూ.. చిటికెన వేలు చూపించారు. బాత్ రూంకి కూడా పోనివ్వరా అని ప్రశ్నించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.












Click it and Unblock the Notifications