వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీకల్నల్ అఘాయిత్యం: ఎంత పని చేశాడు ?

|
Google Oneindia TeluguNews

అగ్రా: జీవితంపై విరక్తి పెంచుకుని, ప్రియురాలు దూరం అవుతుందని ఆవేదనతో ఓ కల్నల్ అఘాయిత్యం చేశారు. ఇండియన్ ఆర్మీలో మంచి హోదాలో పనిచేస్తున్న ఇద్దరు గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఎందుకోగానీ ఈ మధ్యే వీరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.

వీడ్కోలు తీసుకునేక్రమంలో ఏకాంతంగా లాంగ్ డ్రైవ్ వెళ్లారు. అక్కడ సహచర లెఫ్లినెట్ పై బలాత్కారానికి దిగిన ఆ కల్నల్ చివరికి విషపు ఇంజెక్షన్ తో తనను తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్మీ వర్గాల్లో సంచలనం రేపిన ఈ ఘటనపై స్థానికపోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన జాదవ్(41) ఆర్మీలో లెఫ్టినెట్ కల్నల్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఈయన ఆగ్రా ఆర్మీ ఆసుపత్రిలో అనస్తీషియా నిపుణుడిగా విధులు నిర్వహిస్తున్నారు. డెహ్రాడూన్ కు చెందిన మహిళా లెఫ్టినెంట్ కల్నల్ ఆగ్రాలోని ఆర్మీ ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నారు.

గత రెండేళ్లుగా జాదవ్, ఆమె సహజీవనం చేస్తున్నారు. జాదవ్ కు ఇంతకు ముందే భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే జాదవ్ తో సంబంధాలు తెంచుకోవాలని, ఆయనకు దూరంగా ఉండాలని మహిళా కల్నల్ నిర్ణయించారు. ఇటీవల ఆమె జాదవ్ కు విషయం చెప్పారు.

sucide

ఒక సారి లాంగ్ డ్రైవ్ వెళ్లిన తరువాత తన నిర్ణయం చెబుతానని జాదవ్ ఆమెతో అన్నారు. ముందుగా అనుకున్నట్లు గత శుక్రవారం రాత్రి యమునా తీరంలో కారులో లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. మథుర సమీపంలోని రాధా నగర్ కు చేరుకున్నాక వెంట తెచ్చుకున్న విషపు ఇంజెక్షన్ ను జాదవ్ బయటికి తీశారు.

మనం ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని జాదవ్ తన ప్రియురాలికి చెప్పాడు. ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఇంజక్షన్ పొడిచే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. తరువాత ఆమె కారులో నుంచి బయటికి వచ్చేశారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన జాదవ్ వెంటనే కారు డోర్లు లాక్ చేసుకున్నారు.

తరువాత జాదవ్ విషపు ఇంజెక్షన్ ను తన శరీరంలోకి పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే మహిళా లెఫ్టినెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మథుర ఏఎస్పీ అశోక్ కుమార్ సింగ్ మీడియాకు చెప్పారు.

శనివారం ఆర్మీ వైద్యులు జాదవ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారని అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. జాదవ్ మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని అశోక్ కుమార్ పేర్కొన్నారు. మహిళా కల్నల్ ను విచారించి వివరాలు సేకరిస్తున్నామని ఏఎస్పీ అశోక్ కుమార్ సింగ్ తెలిపారు.

English summary
After the lieutenant informed the Army authorities about the incident, Jadhav's body was brought to the military hospital by service personnel, following which an autopsy was conducted by Army authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X