చావుపుట్టుక విధి: రాజ్, మోడీపై ద్వివేది ప్రశంస, విమర్శలతో రివర్స్
ఢిల్లీ: చావు పుట్టుకలు విధి లిఖితమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం చెప్పారు. తాను దైవాన్ని నమ్ముతానని, జనన మరణాలు ముందుగానే నిర్ణయం అవుతాయనేది తన విశ్వాసమని చెప్పారు. బుధవారం నాడు జాతీయ విపత్తు స్పందన దళం పదో వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
తాను ఇలా అంటున్నందుకు వివాదం చెలరేగుతుందేమో కానీ ఈ రెండు ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతాయన్నారు. ఈ విషయంలో తాను సంప్రదాయమైన వ్యక్తినే అని చెప్పారు. అభివృద్ధి పేరుతో గుడ్డిగా వెళ్తూ ప్రకృతి నుండి స్థాయికి మించి తీసుకుంటుండటంతో సమతౌల్యం లోపిస్తోందన్నారు.
నరేంద్ర మోడీకి జనార్ధన్ ద్వివేది ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది ప్రశంసలు కురిపించారు. 2014 ఎన్నికల్లో మోడీ కొత్త శకాన్ని ప్రారంభించారని కితాబిచ్చారు. అనంతరం ఈ వ్యాఖ్యల పైన వివాదం చెలరేగింది. దీంతో ఆయన ప్లేటు మార్చారంటున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ప్రజలను మభ్యపెట్టడంలో మోడీ విజయవంతమయ్యారన్నానని చెప్పారు.
వాగ్దానాల అమలుకు సమయం అవసరం: షా
పదేళ్లపాటు దేశాన్ని పాలించిన యూపీఏ సర్కార్ తమకు భారీలోటుతో అధికారాన్ని అప్పగించిన దృష్ట్యా అభివృద్ధికి సంబంధించిన వాగ్దానాలు పూర్తి చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొంత వ్యవధి పడుతుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం అన్నారు. మోడీ ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన అమితమైన విశ్వాసాన్ని ఎట్టిపరిస్థితులలో వమ్ము చేయబోమన్నారు. తాను ప్రభుత్వానికి సమర్థించేందుకు ప్రయత్నించడం లేదని, వాస్తవాలు చెపుతున్నాన్నారు.
యూపీఏ ప్రభుత్వం ఎంత భారీ లోటుతో మాకు ప్రభుత్వాన్ని అప్పగించినా మోడీ సర్కార్ దాన్ని చక్కదిద్దుతుందని, వృద్ధిరేటును రెండంకెల వైపు పరుగులు తీసేలా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వానికి వ్యూహరచన, దార్శనికత, తాను చేసిన వాగ్దానాలను అమలుపరచగల రాజకీయ సంకల్పబలం పుష్కలంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో భారత్ అభివృద్ధిని ప్రపంచంలో ఎవరూ ఆపలేరన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications