Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్: బెంగాల్‌లో పిడుగుల వర్షం -23 మంది దుర్మరణం -ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

రుతుపవనాల రాక మొదలుకావడంతో వాతావరణం మారిపోయి, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం రాష్ట్రాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. బెంగాల్ లోని పలు జిల్లాల్లో అసాధారణ స్థాయిలో వర్షాలు కురవడంతోపాటు కనీవినీ ఎరుగని రీతిలో పిడుగులు పడ్డాయి. కేవలం పిడుగుపాట్లకే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు..

Recommended Video

    Cyclone Yaas: Andhra Pradesh ముంచుకొస్తున్న తుపాను | Odisha, WB Alert || Oneindia Telugu

    బెంగాల్ వ్యాప్తంగా సోమవారం సాయంత్ర కురిసిన భారీ వర్షాలకు ప్రాణనష్టం భారీగా ఉంది. పిడుగులు పడటంతో 23 మంది చనిపోగా, పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు. దక్షిణ బెంగాల్‌లోని కోల్‌కతాతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ ఉరుములు, పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. పిడుగుల కారణంగా ముర్షిదాబాద్‌లో 9 మంది, హుగ్లీలో 10, పశ్చిమ మిడ్నాపూర్, హౌరా జిల్లాల్లో ఇద్దరుచొప్పున మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

    lightning-claims-23-lives-in-west-bengal-heavy-rainfall-pm-modi-condolence

    బెంగాల్ లో పిడుగుపాటు మరణాలు భారీగా ఉండటంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేశారు. బెంగాల్ లోని అలీపోర్ వాతావరణ కార్యాలయం వివరణ ప్రకారం.. జూన్ 11 న బంగాళాఖాతానికి ఉత్తరాన అల్పపీడనం త‌లెత్త‌నున్న‌ది. ఇదే అల్పపీడనంతో రుతుపవనాల వర్షాలు బెంగాల్‌పై కురుస్తాయి.

    కోల్‌కతా నగరంలో సోమవారం మధ్యాహ్నం నుంచి మేఘాలు క‌మ్ముకోవ‌డంతో రాజ‌ధాని న‌గ‌రం చీకటిగా మారిపోయింది. బలమైన గాలులతో కూడిన వ‌ర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసి ప‌లు ప్రాంతాల్లో ఇళ్లకు నష్టం వాటిల్లింది. 'యాస్' తుఫాను తర్వాత‌ బెంగాల్‌లో సున్నిత‌మైన వేసవి కాలం ప్రారంభమై ప్రజలను చెమటతో తడిసిపోయేలా చేసింది. ఉష్ణోగ్రత కూడా రోజు రోజుకు పెరుగుతూ వ‌చ్చింది. రుతుపవనాలు రాకముందే వర్షం కురియ‌డంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించిన‌ట్ల‌యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+