యూపీ, బీహార్‌లో పిడుగుపాటు: 98మంది మృతి
పాట్నా: బీహార్ రాష్ట్రాన్ని భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. భారీ వర్షాలకు తోడు పిడుగులు వర్షంలా పడటంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో పిడుగుపాటు గురై 24 గంటల్లోనే 56 మంది మృతిచెందినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యాస్‌జీ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని నలంద, ఔరంగాబాద్, రోహ్తాస్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వర్షాలు ఇంకా కొనసాగే పరిస్థితులు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Deeply anguished by loss of lives due to lightning in parts of UP, Bihar, Jharkhand & other parts of the nation over the last few days: PM
— PMO India (@PMOIndia) 22 June 2016
ఉత్తరప్రదేశ్‌లో 46మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24గంటల్లో పిడుగుపాటుకు రాష్ట్రంలో 42మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications