కాలేజీలో ప్రేమ, అంతలోనే ప్రమాదం, ఆసుపత్రిలోనే ప్రియుడితో వివాహం
వేలూరు: ప్రేమకు అంగవైకల్యం అడ్డుకాదని ఓ యువతి నిరూపించింది.తాను ప్రేమించిన యువకుడికి ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయాడు. అయితే కాళ్లు కోల్పోయిన యువకుడిని ఆసుపత్రిలోనే ఆ యువతి వివాహం చేసుకొంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా వాణియంబాడి కొనమేడుకు చెందిన విజయ్, నీలగిరి జిల్లా ఊటీకి చెందిన శిల్పాలు ప్రేమించుకొన్నారు. వీరిద్దరూ కూడ కోయంబత్తూరులోని ఒకే కాలేజీలో చదివే సమయంలో ఒకరినొకరు ప్రేమించుకొన్నారు.
అయితే విజయ్ ఉద్యోగం కోసం బెంగుళూరుకు రైలులో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకొంది. రైలు నుండి ప్రమాదవశాత్తు విజయ్ కొందపడిపోయాడు. దీంతో అతనికి రెండు కాళ్ళను తొలగించారు వైద్యులు. ఆసుపత్రిలోనే విజయ్ చికిత్స పొందుతున్నాడు. వాణియంబాడి ప్రభుత్వాసుపత్రిలో విజయ్ చికిత్స తీసుకొంటున్నారు.
విజయ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న విషయం తెలుసుకొన్న శిల్పా ఆసుపత్రికి వెళ్ళింది. విజయ్ ను ఆ పరిస్థితిలో చూసి కలత చెందింది. అంతేకాదు స్వగ్రామం వెళ్ళిపోయింది. తన తల్లిదండ్రులతో విజయ్‌తో పెళ్ళి ప్రస్తావనను తీసుకొచ్చింది. కాళ్లు పోగొట్టుకొన్న విజయ్‌తో వివాహనికి వారు ఒప్పుకోలేదు.
కానీ, శిల్పా మాత్రం తన పట్టుదలను మాత్రం వదులుకోలేదు. శనివారం నాడు ఆసుపత్రికి వచ్చిన శిల్పా ఆసుపత్రిలోని వైద్యుల సమక్షంలో విజయ్‌ను వివాహం చేసుకొంది.












Click it and Unblock the Notifications