చెన్నై నుంచి విమాన సర్వీసులకు ఓకే
చెన్నై: చెన్నై నుంచి విమానాలను నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం కోన్ని విమానాల సర్వీసులు మాత్రమే పునరుద్దరించనున్నట్లు శుక్రవారం చెన్నై అధికారులు తెలిపారు.
చెన్నై విమానాశ్రయ అధికారులు ఆ వివరాలు వెల్లడించారు. ఎయిర్ ఇండియా నుంచి 7 విమానాల సేవలు ప్రారంభిస్తామని అన్నారు. వీలును బట్టి ఇతర ప్రయివేటు విమానాల సర్వీలు కూడా నడపనున్నట్లు వివరించారు.

చెన్నై సమీపంలోని అరక్కోణంలోని రాజాలి వైమానిక దళానికి చెందిన ఎయిర్ స్టేషన్ నుంచి ఈ విమానాల సర్వీసులు కొనసాగించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత నాలుగైదు రోజుల నుంచి విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే.
శనివారం వరకు చెన్నై నుంచి అన్ని రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు అరాకొర విమానాల సర్వీసులు నడపడంతో టిక్కెట్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications