వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీలో ‘డి’ విటమిన్ ఉందా?: ఐతే మీకు కరోనాతో పోరాడే సత్తా ఉన్నట్లే! లోపం వల్లే మరణాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మానవ శరీర ఎదుగుదలకు, జీవన క్రమానికి విటమిన్ 'డి' ఎంత అవతసరమో అందరికీ తెలిసిదే. సూర్యరశ్మి ద్వారా లభించే ఈ విటమిన్ అనేక రోగాలను కూడా దూరం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కూడా విటమిన్ డీ ఎక్కువగా ఉన్నవారిపై తక్కువ ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కరోనాను ఎదుర్కోవడం డీ విటమిన్

కరోనాను ఎదుర్కోవడం డీ విటమిన్

రోగ నిరోధక శక్తిని పెంచే ఈ విటమిన్ డీ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. విటమిన్ డీ లోపం ఉన్నవారిపై కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోందని కూడా వెల్లడించారు. విటమిన్ డీ లోపం ఉన్నవారికి త్వరగా అంటుకుంటుందని చెబుతున్నారు. కరోనాబారిన పడిన చాలా మంది డీ లోపం ఉన్నవారే కావడం గమనార్హం. యూచికాగో మెడిసన్ దీనిపై అధ్యయనం కూడా చేసింది. 483 రోగులపై అధ్యయనం చేయడం ద్వారా ఈ మేరకు తేల్చింది.

కరోనాను సమర్థవంతంగా..

కరోనాను సమర్థవంతంగా..

డీ విటమిన్ లోపం ఉన్నవారే ఎక్కువగా కరోనా బారినపడుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. విటమిన్ డీ పుష్కలంగా ఉన్నవారిపై కరోనా మహమ్మారి చాలా తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. వైరల్ వ్యాధుల బారినపడకుండా కూడా విటమిన్ డీ ఎంతో ప్రభావితంగా పనిచేస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చారు. కాగా, యూచికాగో మెడిసన్ హాస్పిటల్స్ చీఫ్ డేవిడ్ మెల్ట్జర్ తాజా అధ్యయనానికి నేతృత్వం వహించారు. వైరల్ వ్యాధులతోపాటు కరోనా లాంటి మహమ్మారులను కూడా డీ విటమిన్ సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహకరిస్తుందని వెల్లడించారు.

డీ లోపం ఉన్నవారే కరోనాతో మరణిస్తున్నారు..

డీ లోపం ఉన్నవారే కరోనాతో మరణిస్తున్నారు..

విటమిన్ డీ సప్లిమెంట్సేషన్ కరోనాను ఏ మేరకు తగ్గింస్తుందనేదానిపై మరింత అధ్యయనాలు జరగాల్సి ఉందని మెల్ట్జర్ తెలిపారు. ఏ మేర డోసులు తీసుకుంటే కరోనా నివారించవచ్చో పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. విటమిన్ డీ లోపం ఉండి కరోనాబారిన వారే ఎక్కువగా మరణిస్తున్నారని ఏజింగ్ క్లినికల్ అండ్ ఎక్సిపిరిమెంటల్ రీసెర్చ్ తన అధ్యయనంలో తేల్చింది.

అందుకే యూరోప్ దేశాల్లో మరణాలు ఎక్కువ..

అందుకే యూరోప్ దేశాల్లో మరణాలు ఎక్కువ..

మధ్యవయస్కుల్లో ఎక్కువగా డీ విటమిన్ లోపం ఉంటోందని, వారిపై కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోందని తెలిపింది. స్పెయిన్, ఇటలీ లాంటి యూరోప్ దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించడానికి ఇదే కారణమని వెల్లడించింది. తెల్ల రక్త కణాల నుంచి భారీగా సైటోకైన్స్, ప్రోటీన్స్ ఉత్పత్తి కాకుండా డీ విటమిన్ చూస్తుందని, అంతేగాక, మన ఇమ్యూన్ సెల్స్ యాక్టివేట్ చేస్తాయని ఈ అధ్యయనం తేల్చింది.

అందుకే డీ విటమన్ లోపం..

అందుకే డీ విటమన్ లోపం..

కరోనాను కట్టడి చేయడంలో డీ విటమన్ తగిన రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వెల్లడించింది. సూర్యరశ్మి ద్వారా మనకు తగిన డీ విటమిన్ లభిస్తుంది. కానీ, ఇప్పుడు ఎవరూ సూర్య రశ్మిలో తిరగం లేదు కాబట్టే డీ విటమిన్ లభించడం లేదు. అయితే, సూర్యరశ్మితోపాటు మనం ఆహారంగా తీసుకునే సల్మాన్ లాంటి ఫ్యాటీ ఫిష్, ఫిష్ లివర్ ఆయిల్స్, ఎగ్ యాక్స్, ఫోర్టిఫైయిడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారాడీ విటమిన్ లభిస్తుంది.

English summary
Vitamin D, also known as the sunshine vitamin, is vital for maintaining healthy bones. But this fat-soluble vitamin also plays a pivotal role in boosting the function of your immune system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X