Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: తాగుబోతు కళ్ల ముందే ఊరి వేసుకున్న భార్య, శవాన్ని కిందకుదించి పక్కనే నిద్రపోయిన శాడిస్టు !

చెన్నై/కరూర్: పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేసిన భర్త ఓ కొడుకు తండ్రి అయ్యాడు. ప్రైవేట్ డ్రగ్స్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న భర్త మద్యంకు బానిస అయ్యాడు. పీకలదాక మద్యం సేవిస్తూ ప్రతిరోజు 24 గంటలు నిషాలో ఉంటున్న భర్త ఇంటికి వెళ్లడం మరిచిపోతున్నాడు. భర్త టార్చర్ తట్టుకోలేని భార్య ఆమె కొడుకును పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తారింటికి వెళ్లిన మొగుడు మళ్లీ మమూలే అంటూ మద్యం మత్తులో ఊగిపోయాడు. ఇక్కడా తన పరువు పోయిందని ఆవేదనతో మద్యం మత్తులో నిద్రపోతున్న భర్త కళ్ల ముందే భార్య ఉరి వేసుకునింది. మద్యం మత్తులో భార్య ఉరి వేసుకున్న విషయం గుర్తించిన భర్త కత్తితో ఫ్యాన్ కు వేలాడుతున్న భార్య గొంతుకు ఉన్న వేల్ కత్తిరించి శవాన్ని కిందకుదించి మళ్లీ శవం పక్కనే గురకపెట్టి నిద్రపోయాడు.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు


తమిళనాడులోని పెరంబదూర్ జిల్లా బాగళూరుకు చెందిన ధనశేఖరన్, కరూర్ జిల్లా మాయనూర్ లో నివాసం ఉంటున్న మాలతి (41) అనే మహిళకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. పెళ్లి చేసుకున్న మొదట్లో ధనశేఖరన్ చక్కగా భార్య మాలతితో కాపురం చెయ్యడంతో ఓ కొడుకు పుట్టాడు. భార్య మాలతి కొడుకుతో పాటు ధనశేఖరన్ సంతోషంగా ఉండేవాడు.

తాగుబోతు కాదు..... వీరతాగుబోతు

తాగుబోతు కాదు..... వీరతాగుబోతు

వేలూరులోని ఓ ప్రైవేట్ డ్రగ్స్ కంపెనీలో ధనశేఖరన్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం తీసుకుంటున్న ధనశేఖరన్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు తాగుతున్న ధనశేఖరన్ నిషాలో మునిగితేలుతున్నాడు. ధనశేఖరన్ ను తాగుబోతు అనడంకంటే వీరతాగుబోతు అని అందరూ పిలవడం మొదలుపెట్టారు.

రాత్రి ఎక్కడపడితే అక్కడ అంతే

రాత్రి ఎక్కడపడితే అక్కడ అంతే


రాత్రిపూట పీకలదాక మద్యం సేవిస్తున్న ధనశేఖరన్ రాత్రి ఎక్కడపడితే అక్కడ నిద్రపోవడం మొదలుపెట్టాడు. రాత్రి సక్రమంగా ఇంటికి రాకపోవడం, ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో ధనశేఖరన్ తీరుతో విసిగిపోయిన అతని భార్య మాలతి కొడుకును పిలుచుకుని కరూర్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది.

మూడురోజులు నిషా తగ్గలేదు

మూడురోజులు నిషా తగ్గలేదు

భార్య మాలతి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆమె తిరిగి ఇంటికి వస్తుందని ధనశేఖరన్ కొన్ని రోజులు వేచి చూశాడు. భార్య మాలతి తిరిగిరాకపోవడంతో జులై 9వ తేదీన మాలతి పుట్టింటికి ధనశేఖరన్ వెళ్లాడు. భార్య మాలతి ఇంటికి వెళ్లిన ధనశేఖరన్ అక్కడ మూడురోజుల పాటు నిషా తగ్గకుండా పీకలదాక మద్యం సేవిస్తూనే ఉన్నాడు. తన భర్త పుట్టింటికి వచ్చినా ఇక్కడా తన పరువు తీస్తున్నాడని మాలతి ఆవేదన చెందింది.

భర్త కళ్ల ముందే ఆత్మహత్య చేసుకున్న భార్య

భర్త కళ్ల ముందే ఆత్మహత్య చేసుకున్న భార్య

తన భర్త ధనశేఖరన్ జీవితంలో మారడని డిసైడ్ అయిన మాలతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. పీకలదాక మద్యం సేవించిన ధనశేఖరన్ భార్య మాలతి ఇంట్లోని ఓ రూమ్ లో నిద్రపోయాడు. మత్తులో చలనం లేకుండా పడిఉన్న భర్త కళ్ల ముందే మాలతి వేల్ తో ఉరి వేసుకుంది. కొంత సేపటి తరువాత మెలుకువ రావడంతో ధనశేఖరన్ భార్యను కిందకు దించడానికి ప్రయత్నించాడు. మత్తులో పైకి లేవలేక అతి కష్టం మీద పైకిలేచిన ధనశేఖరన్ ఫ్యాన్ కు వేలాడుతున్న భార్య మెడకు ఉన్న వేల్ కత్తిరించి ఆమె శవాన్ని కిందకు దించి మళ్లీ శవం పక్కనే పడుకున్నాడు.

భార్య శవం పక్కనే నిద్రపోయిన పాపాత్ముడు

భార్య శవం పక్కనే నిద్రపోయిన పాపాత్ముడు


తల్లి ఆత్మహత్య చేసుకోవడం, తండ్రి నిషాలో ఉంటూ పలకకపోవడంతో మాలతి కొడుకు ఏడుపు మొదలుపెట్టాడు. భార్య మాలతి శవమై కనిపించినా మద్యం మత్తులో పట్టించుకోని భర్త ధనశేఖరన్ కొడుకు ఏడుస్తున్నాడని, నిద్రపాడు అవుతోందని ఆవేశంతో ఊగిపోయాడు. ఏడ్చకుండా ఉండూ రా అంటూ కొడుకు మీద గట్టిగా కేకలు వేసిన ధనశేఖరన్ మాలతి శవం పక్కన గురుకపెట్టి నిద్రపోయాడు. మాలతి కొడుకు ఏడ్చుకుంటూ బయటకు వెళ్లడంతో ఆమె పుట్టింటి వాళ్లకు అనుమానం వచ్చి గది లోపలికి వెళ్లి చూడగా మాలతి శవమై కనిపించింది.

 ఏం జరిగింది అని పోలీసులనే అడిగాడు

ఏం జరిగింది అని పోలీసులనే అడిగాడు

విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి మాలతి శవాన్ని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్నా ధనశేఖరన్ కు మాత్రం మత్తు దిగలేదు. చివరికి పోలీసులు ధనశేఖరన్ కు మజ్జిగ తాగించి అతనికి నాలుగు పీకి మత్తు దించారు. భార్య మాలతి ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటల తరువాత ధనశేఖరన్ కు మత్తు దిగడంతో ఏం జరిగింది అని మమ్మల్నే ప్రశ్నిస్తున్నాడని పోలీసులు విచారం వ్యక్తం చేశారు. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా మరిచిపోయి ఆమె శవం పక్కనే భర్త నిద్రపోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+