Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో వైరల్ : కరోనా వ్యాక్సిన్‌ లైన్ కాదది..లిక్కర్ సెలబ్రేషన్స్..మగువలు కూడా మందుకే జై..!

కరోనావైరస్ దేశాన్ని కుదిపేసింది. దీంతో కఠినమైన ఆంక్షలను విధిస్తూ దేశంలో లాక్‌డౌన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్‌తో అందరి బాధ ఒకలా ఉంటే మందు బాబుల బాధ మరోలా ఉంది. ఈ రెండు నెలలు చుక్క మందు దొరక్క పిచ్చివాళ్లుగా మిగిలిన మందుబాబులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. చుక్కమందు పడితే కానీ వారి బండి నడవదు. అలా తయారైంది పరిస్థితి. ఇక లాక్‌డౌన్ ఆంక్షలపై కేంద్రం కొన్ని సడలింపులివ్వడంతో ముందుగా పండగ చేసుకుంటున్నది మందుబాబులే కావడం విశేషం. దేశవ్యాప్తంగా గ్రీన్‌ ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో నిన్న రాత్రి ఎలా గడుస్తుందా అని మద్యం ప్రియులు ఎంతో ఎదురు చూశారు. షాపులు ఓపెన్ చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

కరోనా వైరస్‌తో దేశం లాక్‌డౌన్‌లోకి

కరోనా వైరస్‌తో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లి పోవడం ఆ తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే మద్యం షాపులు తెరుచుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో మందుకు ముఖం వాచిపోయిన మందుబాబులు సోమవారం ఉదయం నుంచే మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేరా క్యూ కట్టారు. అది కూడా చాలా పద్ధతిగా లైన్లలో నిల్చున్నారు. వీరి క్రమశిక్షణ చూస్తే ఔరా అని అనకుండా ఉండలేము. ఇదిలా ఉంటే కర్నాటకలో చాలా చోట్ల వైన్ షాపులు తెరవడంతో అక్కడ ఒక పండగలా చేసుకున్నారు. ఒక పెద్ద వేడుకే నిర్వహించారు. వైన్ షాపులు తెరవగానే పటాకులు పేల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. కరువు నుంచి బయటపడ్డట్టుగా ఫీల్ అయ్యారు మందుబాబులు. కర్నాటకలోని కోలార్‌ పట్టణంలో వైన్ షాపుల ముందు బాణాసంచా పేల్చారు. మందుషాపులు తెరవడంతో ఎన్నో రోజులుగా చుక్క మందు కోసం ముఖం వాచిపోయిందని ఇక పండగే పండగ అని ఓ మందుబాబు చెప్పాడు.

చిత్తూరు జిల్లాలో సామాజిక దూరం మరిచిన మద్యం బాబులు


ఇక సోషల్ మీడియాలో తెరిచి ఉన్న వైన్ షాపుల ముందు బారులు తీరిన జనం వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. చాలా చోట్ల మందు వాసన తగలగానే సామాజిక దూరం పాటించాలన్న నిబంధనను మరిచిపోయారు మందుబాబులు. ఎంత సేపు తమ వంతు ఎప్పుడొస్తుందా.. ఎన్ని బాటిళ్ల మద్యం కొనుగోలు చేయాలా... స్టాక్ ఎంత ఉంచుకోవాలనేదానిపైనే మద్యం ప్రియులు ఫోకస్ చేశారే తప్ప సామాజిక దూరం పాటిద్దామన్న కనీస విషయాన్ని మరిచారు. కొన్ని చోట్ల అయితే మద్యం దుకాణాల ముందు గొడవలు కూడా జరిగినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో ఆంధ్రా తమిళనాడు బోర్డర్‌లో ఉన్న ఒకే ఒక వైన్ షాపు వద్ద ప్రజలు బారులు తీరారు. వారు సామాజిక దూరం మరిచారు. సరిహద్దుల్లో ఉండటంతో అటు తమిళనాడు ప్రజలు ఇటు చిత్తూరు ప్రజలు బారులు తీరారు. వారిని కంట్రోల్ చేయడం పోలీసులు తరం కూడా కాలేదు.

Recommended Video

    Lockdown 3.0 : It's Pollution Time, Massive Traffic Jams On Roads In Amid Relaxations
    క్యూలైన్లలో మగువలు

    క్యూలైన్లలో మగువలు


    ఇక కర్నాటకలో మందుబాబులు సెలబ్రేషన్స్ పీక్ స్టేజెస్‌కు చేరుకుంటే మగువలు కూడా మద్యం కోసం క్యూలైన్లలో నిల్చున్నారు. బెంగళూరులో ఓ మద్యం దుకాణం ముందు మద్యం కోసం యువతులు నిల్చున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారికి ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసింది. ఇక వీరు సామాజిక దూరం పాటిస్తూ ఎండలో నిల్చుని తమ వంతుకోసం నిల్చున్నారు. అయితే మద్యం విషయంలో మగువలు కూడా పురుషులతో సమానంగా ఓపికతో క్యూలైన్లలో నిల్చోవడంపై నెటిజెన్లు సెటైర్లతో కూడిన కామెంట్లు వేశారు. ఇక కరోనా వ్యాక్సిన్‌ వచ్చిందంటే కూడా సెలబ్రేట్ చేసుకోని మందు బాబులు మద్యం షాపులు తెరిస్తే మాత్రం పండగా చేసుకున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+