Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రా బార్డర్ లో ఎంపీ సుధాకర్ రెడ్డి పేరుతో 50 వేల మందికి లిక్కర్ పార్టీ, ఓరి నాయనో ?

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన చిక్కబళ్లాపూర్‌ బీజేపీ లోక్‌సభ సభ్యుడు, కర్ణాటక మాజీ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ ను గెలిపించిన బీజేపీ-జేడీఎస్‌ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర వివాదాలకు కారణం అయ్యింది. బెంగళూరు నగర శివార్లలోని నెలమంగళలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచితంగా మద్యం, మాంసాహారం భోజనం పంపిణీ చెయ్యడం తీవ్ర చర్చకు కారణం అయ్యింది

ప్రజలు ఉచిత మద్యం, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీల కోసం కేకలు వేస్తూ హంగామా వేయడంతో ఈ కార్యక్రమం గందరగోళంగా మారింది. నెలమంగళ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ చౌదరి స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమంలో పోలీసులు కార్యక్రమానికి హాజరు అయిన బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మాంసాహార భోజనం, ఉచిత మద్యం పంపిణిలో బీర్ లు, హార్డ్ లిక్కర్ ప్యాకెట్లు ఈ కార్యక్రమంలో అందించారని ఆరోపణలు ఉన్నాయి.

Liquor party for 50 thousand people in the name of Chikkabellapuram BJP MP

చిక్కబళ్లాపురం లోక్ సభ నియోజక వర్గం ఓటర్లు బీజేపీ నాయకుడు డాక్టర్ కే సుధాకర్ ను గెలిపించినందుకు ఓ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. 10,000 నుండి 15,000 మంది వస్తారని నిర్వహకులు అంచనా వేశారు, అయితే 60,000 మందికి పైగా ప్రజలు కృతజ్ఞతా కార్యక్రమానికి రావడంతో ఆ జనాన్ని నియంత్రించడం అసాధ్యంగా మారిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి లైసెన్స్ ఇవ్వరాదని ఎక్సైజ్ శాఖకు సూచించారు.

ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిందని, ఇందులో పోలీసు శాఖ తప్పేమీ లేదని, లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చే బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉందని బెంగళూరు రూరల్ ఎస్పీ సీకే .బాబా తెలిపారు. కార్యక్రమం నిర్వాహకులు అనుమతి కోసం నెలమంగల డీఎస్‌పీకి దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమం నిర్వహకులు ముందుగా మా శాఖకు రూ. 11, 500 రుసుము చెల్లించారు, ఆ తర్వాత మేము ఒక రోజు అనుమతిని జారీ చేసాము అని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నగేష్ కుమార్ చెప్పినట్లు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

Liquor party for 50 thousand people in the name of Chikkabellapuram BJP MP

కార్యక్రమంలో శాసన సభ ప్రతిపక్ష నేత ఆర్.అశోక్, మాజీ ఎమ్మెల్యే నాగరాజు, జేడీఎస్ మాజీ ఎమ్మెల్సీ ఇ.కృష్ణప్ప పాల్గొన్నారు. చిక్కబళ్లాపూర్ ఎంపీ డాక్టర్ కే సుధాకర్ మాట్లాడుతూ నాకు మద్యం పంపిణీ గురించి తెలియదని, నేను అలాంటి వాటిని ప్రోత్సహించను అని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎక్కడో మద్యం కొనుగోలు చేసి తీసుకు వచ్చి ఇక్కడ తాగారు అని, బీజేపీ ఎంపీ డాక్టర్ సుధాకర్ అంటున్నారు.

చిక్కబళ్లాపుర ఎంపీపీ కార్యాలయంలో ఎంపీ డాక్టర్‌ కే సుధాకర్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం గురించి నాకేమీ తెలీదు, ఈ ఘటన మీడియాలో రావడంతో తనకు విషయం తెలిసిందని, బీజేపీ, జేడీఎస్‌ కార్యకర్తలు ఓ కార్యక్రమానికి ప్లాన్‌ చేశారని అన్నారు. అయితే 20 ఏళ్ల రాజకీయాలలో మా సొంత కార్యకర్తలకు మద్యం పంచితే తప్పేమీ కాదు అని, గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలకు మద్యం పంపిణి చెయ్యలేదా, ఇక్కడ ఎవరూ సాఛాలు కాదు అంటూ కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+