వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ ఆన్ లైన్ లో మద్యం విక్రయాలు .. ఇంటికే లిక్కర్ .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ లాక్ డౌన్ నేపధ్యంలో వైన్ షాపుల వద్ద రద్దీని నివారించడానికి, ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం ఇంటి వద్దకే మద్యం పంపిణీ చేయడానికి ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. 'గ్రీన్ జోన్'లలో ఉన్న వారికి మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు మొదలు కాగా మందుబాబుల నుండి వినూత్న స్పందన వస్తుంది. లిక్కర్ కోసం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న పరిస్థితుల నేపధ్యంలో ఛత్తీస్ గడ్ ఆన్ లైన్ విక్రయాలపై దృష్టి పెట్టింది .

Recommended Video

Women Waiting In Queue In Front Of Wine Shops , Pics Viral
సిఎస్‌ఎంసిఎల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో లిక్కర్ అమ్మకాలు

సిఎస్‌ఎంసిఎల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో లిక్కర్ అమ్మకాలు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నియంత్రించే సిఎస్‌ఎంసిఎల్ ఛత్తీస్ గడ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఈ పోర్టల్‌ ను ప్రారంభించారు . మద్యం ఆర్డర్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే సిఎస్‌ఎంసిఎల్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CSMCL వెబ్‌సైట్ ద్వారా కూడా ఆర్డర్లు ఇవ్వవచ్చు. కస్టమర్ ఒకేసారి 5000 మిల్లీ లీటర్ల మద్యం కోసం ఆన్‌లైన్ ఆర్డర్‌ను ఇవ్వవచ్చు, డెలివరీ ఛార్జీలు రూ . 120 గా నిర్ణయించారు .

వైన్ షాపుల వద్ద రద్దీని తగ్గించే క్రమంలో ఛత్తీస్ గడ్ సర్కార్ నిర్ణయం

వైన్ షాపుల వద్ద రద్దీని తగ్గించే క్రమంలో ఛత్తీస్ గడ్ సర్కార్ నిర్ణయం

వైన్ షాపుల వద్ద రద్దీని తగ్గించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో మద్యం విక్రయానికి అనుమతి ఇచ్చింది అని అధికారులు చెప్తున్నారు. ఇక ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో రాయ్ పూర్ మరియు కోర్బా జిల్లాల్లో మాత్రం హోమ్ డెలివరీ సౌకర్యం వర్తించదు.ఇంకా అక్కడ గ్రీన్ జోన్ గా ప్రకటించకపోవటమే కారణం . ఆ ప్రాంతంలోని కరోనా పాజిటివ్ కేసులను బట్టి కేంద్రం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ గా విభజించింది . కరోనా వైరస్ లాక్ డౌన్ మధ్య ఒక నెలకు పైగా మూతపడిన మద్యం దుకాణాలు సోమవారం నుండి తెరుచుకుంటున్నాయి . రాయ్‌పూర్ మరియు ఇతర జిల్లాల్లోని మద్యం దుకాణాల వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలో నిలబడ్డారు. భౌతిక దూర నిబంధనలను ధిక్కరించారు.

సోషల్ డిస్టెన్స్ పాటించటం లేదనే ఆన్ లైన్ లిక్కర్ సేల్స్

సోషల్ డిస్టెన్స్ పాటించటం లేదనే ఆన్ లైన్ లిక్కర్ సేల్స్

సోషల్ డిస్టెన్స్ పాటించని కారణంతోనే ఇంటి వద్దకే మద్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.మొత్తానికి వైన్‌షాపుల దగ్గర ఒకరిమీద ఒకరు పడి సామాజిక దూరం పాటించకుండా కరోనా కష్టాలు తెచ్చుకోకుండా ఇంటి దగ్గరే కూర్చొని లిక్కర్ కొనుగోలు చెయ్యటం మంచిదే అంటున్నారు. ఇప్పటి వరకు ఛత్తీస్‌గడ్ లో 58 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ వ్యాధి నుండి 36 మంది కోలుకున్నారు.భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 46,433 కు పెరిగింది. గత 24 గంటల్లో 3,900 మంది పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది . ఇక కరోనా మరణాల సంఖ్య 1,568 కు పెరిగింది.

English summary
To avoid crowding at the wine shops amid coronavirus lockdown, the Chhattisgarh government has launched an online portal to deliver liquor at your home. The service is only available to those who are in 'green zones', said the state government.The portal was named after the state-run CSMCL (Chhattisgarh State Marketing Corporation Limited), which controls the sale of liquor in the state, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X