నకిలీ బాబాల్లో.. స్వామి నిత్యానంద ఎందుకు లేడు?

Posted By:
Subscribe to Oneindia Telugu
  14 fake babas :There is no Swamy Nityananda Why నకిలీ బాబాల్లోస్వామి నిత్యానంద ఎందుకు లేడు?|Oneindia

  న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో దేశంలో 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ అఖిల భారత అఖార పరిషద్‌ ఆదివారం ఓ జాబితాను విడుదల చేసింది. అయితే అందులో స్వామి నిత్యానంద పేరు లేకపోవడం వివాదాస్పదమైంది.

  ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాబాల్లో ఒకడైన నిత్యానందపై 2009లో కర్ణాటకలో రేప్‌ కేసు దాఖలైంది. ఆయన స్థాపించిన ఫౌండేషన్‌పై ఏడు అవినీతి కేసులు ఉన్నాయి. అమెరికా నుంచి కూడా ఆయనకు అక్రమంగా నిధులందాయన్న ఆరోపణలూ ఉన్నాయి.

  swamy-nityananda

  నకిలీ బాబాల జాబితాలో నిత్యానంద పేరును కూడా చేర్చాలని జునా అఖారాకు చెందిన హరిగిరి ప్రతిపాదించినప్పటికీ మహానిర్వాణి అఖారాలు తీవ్రంగా అభ్యంతరం పెట్టడంతో ఆయన పేరు జాబితాలో చేరలేదని నిర్వాణి అఖారాకు చెందిన చీఫ్‌ ధరమ్‌ దాస్‌ మీడియాకు తెలిపారు.

  దేశవ్యాప్తంగా ఉన్న 13 అఖారాలు ఆదివారం నాడు అలహాబాద్‌లో సమావేశమై నకిలీ బాబాల జాబితాను తయారు చేశారు. నకిలీ బాబాల కారణంగా అసలైన బాబాల ప్రతిష్ట కూడా దిగజారిపోతోందని, అందుకనే నకిలీ బాబాల జాబితాను విడుదలచేసి వారికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునివ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది.

  ఈ 13 అఖారాల్లో ఏడు శైవ తెగకు చెందిన అఖారాలుకాగా మూడు వైష్ణవ తెగకు, మూడు సిక్కు తెగకు చెందిన అఖారాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏర్పాటయినదే అఖిల భారత అఖార పరిషద్‌. 2013, అలహాబాద్‌ కుంభమేళాలో నిత్యానంద్‌కు మహామండలేశ్వర్, మహానిర్వాణి అఖారాకు చెందిన ప్రధాన పూజారి పట్టాభిషేకం చేసినందున ఆయన పేరును నకిలీ బాబాల జాబితాలో చేర్చేందుకు మహానిర్వాణి అఖారాలు నిరాకరించారు. నకిలీ బాబాల జాబితాలో గుర్మీత్‌ సింగ్‌ సహా ఆరెస్సెస్‌ సభ్యుడు అసీమానంద్‌ లేదా ఆశారామ్, ఆయన కుమారుడు నారాయణ్‌ సాయి, రాధేమా, సచ్‌దానంద్‌ గిరి, నిర్మల్‌ బాబాల పేర్లు చోటుచేసుకున్నాయి.

  సమాజం నుంచి నకిలీ బాబాలను నిర్మూలించడం పట్ల మహానిర్వాణి అఖారాలకు చిత్తశుద్ధి లేదని, దిగంబర అఖారాకు చెందిన బాబా హఠ్‌ యోగి విమర్శించారు. అఖారాల్లో చాలా మంది పేరుకే సాధువులని, వారు డబ్బులు తీసుకొని కావాల్సిన బిరుదులు ఇస్తుంటారని నిర్వాణి అఖారాకు చెందిన సత్యేంద్ర దాస్‌ ఆరోపించారు.

  నకిలీ బాబాల జాబితా నుంచి నిత్యానందను తప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన అఖిల భారత ఆఖార పరిషద్‌ అధ్యక్షుడు నరేంద్ర గిరిపైనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. రియల్టర్‌ వ్యాపారం చేసే ఆయనకు ఓ బారు కూడా ఉందన్నది అందులో ఓ ఆరోపణ.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  ABAP i.e. the Akhil Bharatiya Akhara Parishad, which is the apex body of Hindu Sadhus has come out with a list of “14 fake babas” on Sunday. Yes, of late, there have been too many controversies surrounding Godmen and we really look forward to some action being taken against them. Swami Narendra Giri, the president of ABAP, said that the common people have to be cautious about these fake babas who take people for granted under the name of “Traditions”. In fact, they are a dark spot in the name of Sanyasis and Sadhus.But in this list.. there is no name of Swamy Nityananda.. Why?

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి