క్రిమినల్ కేసులు ఉన్న టాప్ లీడర్స్, బళ్లారినా మజాకా, మాజీ సీఎం మీద ఎన్ని కేసులంటే !!
బెంగళూరు/బళ్లారి/బెళగావి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయ్యింది. మే 10వ తేదీన పోలింగ్, మే 13వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల కమీషన్ ప్రకటించింది. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య పోటీ ఉంది. ఇక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ కేఆర్ పీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటుకోవడానికి సిద్దం అయ్యింది. ఇదే సమయంలో కర్ణాటకలో ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అనే విషయం తెలుసుకుంటే ఓటర్లకు మంచింది. క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్న రాజకీయ నాయకుల్లో మాజీ సీఎం కూడా ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వారిలో బళ్లారి నాయకులు కొందరు ఉన్నారు.
రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం సర్వసాధారణం అయిన విషయం తెలిసిందే. కొందరు రాజకీయ నాయకులు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. కొందరు నాయకులు కేసుల నుంచి విముక్తి పొందుతున్నారు. కొందరు నాయకులు వారి రాజకీయ రాజకీయ ఉనికినే కోల్పోయిన సందర్బాలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న నాయకుల జాబితా ఇలా ఉంది.
ముఖ్యమంత్రి కావాలని అనేక ప్రయత్నాలు చేసి చివరికి ఉప ముఖ్యమంత్రి, తరువాత మంత్రి అయిన సీనియర్ బీజేపీ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప (శివమొగ్గ) మీద 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎక్కువ శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్టర్ డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో గత ఏడాది కేఎస్ ఈశ్వరప్ప ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
బెళగావి దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే (బీజేపీ) అభయ్ పాటిల్ మీద ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి. హనుగుంద బీజేపీ ఎమ్మెల్యే దోడ్డనగౌడ జి పాటిల్ మీద ఆరు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి, విజయపుర సిటీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ మీద ఆరు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీకి చెందిన బసవనగౌడ పాటిల్ అప్ప మీద అనేక ఆరోపణలు చేసి నిత్యం మీడియాలో నానుతూ ఉన్నాడు.

ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్, బెళగావి గ్రామీణ ఎమ్మెల్యే, లేడీ లీడర్ లక్ష్మీ హెబ్బాళ్కర్ మీద ఆరు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. సేడం బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిల్ మీద ఐదు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. హావేరి బీజేపీ ఎమ్మెల్యే నహరూ ఓలేకర్ మీద ఐదు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
కర్ణాటక రాజకీయాలను ఒకప్పుడు శాసించిన బళ్లారి జిల్లాలోని నాయకుల మీద నమోదు అయిన క్రిమినల్ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. గతంలో బళ్లారి జిల్లాలోనే ఉన్న విజయనగర తరువాత విడిపోయి విజయనర జిల్లా అయ్యింది. విజయనగర ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆనంద్ సింగ్ మీద 16 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, బళ్లారి సిటీ బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మీద ఐదు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఇక బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బి. నాగేంద్ర మీద (కాంగ్రెస్) 15 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. దావణగెరె ఉత్తర నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఏ. రవీంద్రనాథ్ మీద 11 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి మునిరత్న (ప్రవాసాంధ్రుడు) మీద ఐదు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నాయకులు కేసులు అన్ని ఒక పక్క హాట్ టాపిక్ అయితే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్ డీ. కుమారస్వామి మీద క్రిమినల్ కేసులు ఉండటం మరో హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి మీద 8 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం మీద కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ నాయకుల పేర్లు తెరమీదకు వచ్చాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications