ఎన్నికల్లో ఓటేసి మోడీని పొగడిన అద్వానీ
అహ్మదాబాద్: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ ఓటేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి గెలిచినట్లే మున్సిపల్ ఎన్నికల్లోనూ కమలం పార్టీ విజయం సాధిస్తుందని అద్వానీ చెప్పారు.
దేశంలో మంచి రోజులను తేవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సరైన దిశలో పయనిస్తోందని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం సరైన దిశలో నడుస్తున్నందున ఫలితాలు బాగుంటుందని, దానివల్ల మొత్తం వ్యవస్థ సమయాన్ని తీసుకుంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, జామ్ నగర్, భావ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదివారంనాడు ఎన్నికలు జరిగాయి. 95.9లక్షల మంది పట్టణ ఓటర్లు బిజెపి పరిపాలన మళ్లీ కొనసాగాలా వద్దా అనేది తేల్చేందుకు ఓటేశారు.
పటేల్ సామాజిక వర్గం ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌కు తాజా మున్సిపల్ ఎన్నికలు పరీక్షగా మారాయి.












Click it and Unblock the Notifications