అక్కడ చిరు వ్యాపారాలు,దుకాణాలే కాదు ఫంక్షన్ హాల్స్ కూడా : యూపీ మార్గదర్శకాలు
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతుంది. ఇక ఈ నేపధ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనా కట్టడికి అన్ని రాష్టాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా కేంద్రం లాక్ డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చి వాటిపై ఆయా రాష్ట్రాలు స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు . దీంతో ఇక యూపీలో కూడా కరోనా కట్టడి చర్యలు చేపడుతూనే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ .

లాక్‌డౌన్ 4.0 మే 31 వరకు పొడిగించిన యూపీ సర్కార్
కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తిని అరికట్టటానికి ప్రస్తుతం పొడిగించిన లాక్‌డౌన్ 4.0 మే 31 వరకు కొనసాగనుంది . ఇక దీని కోసం కొన్ని లాక్ డౌన్ సడలింపులు , కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది యూపీ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్స్ లో తప్ప మిగతా ప్రాంతాలలో కార్యకలాపాలను అనుమతించడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారాలను ఇచ్చింది. లాక్డౌన్ 4.0 సమయంలో యుపిలో అనుమతించబడిన మరియు నిషేధించబడిన కార్యకలాపాల జాబితా చూస్తే ఉదయం 4 నుంచి ఉదయం 7 గంటల వరకు మూడు గంటల పాటు సరైన జాగ్రత్తలతో కూరగాయల మార్కెట్లను (సబ్జీ మండి) తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

లాక్ డౌన్ నిబంధనల సడలింపు మార్గదర్శకాలు విడుదల చేసిన యూపీ
రిటైల్ కూరగాయలను ఉదయం 6 నుండి 9 గంటల మధ్య అమ్మవచ్చునని పేర్కొంది. రాత్రి సమయంలో రాష్ట్రంలో నిషేధిత ఉత్తర్వులు అమల్లో ఉంటాయి మరియు అవసరమైన సేవలు తప్ప, రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల మధ్య ఎటువంటి వాహనాలను కూడా అనుమతించరు.ఇక కొన్ని పరిమితులతో ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించారు. డ్రైవర్‌తో సహా ముగ్గురు ప్రయాణీకులు నాలుగు చక్రాల మీద ప్రయాణించవచ్చు, ద్విచక్ర వాహనాలపై ఇద్దరు ప్రయాణం ఒక మహిళల విషయంలో మాత్రమే అనుమతించబడింది మరియు త్రీ వీలర్‌లో డ్రైవర్‌తో సహా ముగ్గురికి అనుమతి ఉంది.

చిరు వ్యాపారాలు, రెస్టారెంట్లు , ఫంక్షన్ హాల్స్ కు అనుమతి . కండీషన్స్ అప్లై
వీధి వ్యాపారులు మరియు హాకర్లు కూడా రాష్ట్రంలో తమ పని చేసుకోవచు . రెస్టారెంట్లు పనిచేయడానికి అనుమతించబడ్డాయి కాని హోమ్ డెలివరీ మాత్రమే చెయ్యాల్సి ఉంటుంది. బాంకెట్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ తెరవడానికి అనుమతి ఇచ్చారు కానీ 20 మందికి పైగా వివాహానికి హాజరు కావటానికి వీల్లేదని పేర్కొంది. కేంద్రం సూచించినట్లు ఎక్కువ మంది గుంపులుగా లేకుండా స్టేడియంలను తిరిగి తెరవడానికి అనుమతి ఉంది. కొత్త మార్గదర్శకాలలో ప్రింటింగ్ ప్రెస్‌లు, డ్రై క్లీనర్‌లు, కంటైనేషన్ జోన్‌ల వెలుపల పారిశ్రామిక కార్యకలాపాలు మరియు స్వీట్ షాపులు కూడా అనుమతించబడ్డాయి. ఇక నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ ఆస్పత్రులు అత్యవసర ఆపరేషన్లకు కూడా అనుమతి ఇచ్చింది .

స్కూళ్ళు , కాలేజీలు , సమావేశాలు ,థియేటర్లు ,జిమ్స్ కు నో
లాక్డౌన్ 4.0 సమయంలో పాఠశాల, కళాశాలలు మరియు అన్ని ఇతర విద్యాసంస్థలు మూసివేయబడతాయి. ఇంకా వాటికి వెసులుబాటు ఇవ్వలేదు . తాజా మార్గదర్శకాలలో మతపరమైన సమావేశాలు నిషేధించబడ్డాయి.అత్యవసర , ఎయిర్ అంబులెన్స్ మినహా విమాన సేవలు రాష్ట్రంలో లాక్డౌన్ కాలంలో పనిచేయడానికి అనుమతించబడవు. లాక్డౌన్ యొక్క నాల్గవ దశలో మెట్రో సేవలు కూడా కొనసాగవు . లాక్డౌన్ 4.0 సమయంలో సినిమా హాళ్ళు, మాల్స్ మరియు జిమ్‌లకు కూడా వెసులుబాటు లేదు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications