Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lockdown: భార్యను గ్యాస్ సిలిండర్ తో కొట్టి చంపిన భర్త, ఆత్మహత్య, ఆసుపత్రిలో ఏం జరిగింది ?

పుదుచ్చేరి: పెళ్లి చేసుకున్న తరువాత గత 11 ఏళ్ల నుంచి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అన్యోన్యంగా జీవిస్తున్నారు. చిన్నచిన్న సమస్యలు ఎదురైనా భర్తను మాత్రం భార్య వదిలిపెట్టలేదు. అయితే దంపతులు ఆసుపత్రికి వెళ్లి వచ్చిన తరువాత ఇంట్లో ఏం జరిగిందో ఏమో ? తెలీదు కాని జరగరానికిది జరిగిపోయింది. గ్యాస్ సిలిండర్ తో భార్యను అతిదారుణంగా హత్య చేసిన భర్త మేడ మీద గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిని తమ కళ్ల ముందే తండ్రి హత్య చేసి ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలు అయ్యారు.

హ్యాపీ జీవితం

హ్యాపీ జీవితం

పుదుచ్చేరిలోని ముత్యాలపేట నగర్ లోని సౌత్ అడ్రస్ ప్రాంతంలో సుబ్రమణి (41), మేనక (36) దంపతులు నివాసం ఉంటున్నారు. సుబ్రమణి, మేనక దంపతులకు 10 ఏళ్లు, ఐదేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహం అయిన తరువాత సుబ్రమణి, మేనక దంపతులు ఇద్దరు కుమారులతో కలిసి కొంత కాలం క్రితం వరకు హ్యాపీగా సంసారం సాగించారు.

అక్కడ మొదలైయ్యింది

అక్కడ మొదలైయ్యింది

కొంతకాలం నుంచి సుబ్రమణి, మేనక దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. లాక్ డౌన్ సందర్బంగా సుబ్రమణి ఇంటిలోనే ఉంటున్నాడు. ఇటీవల దంపతులు ఇద్దరు ప్రతిరోజు ఇంట్లో గొడవ పడటం స్థానికులు చూస్తున్నారు. సుబ్రమణి, మేనక దంపతులకు వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఇంతకాలం నచ్చచెబుతూ వస్తున్నారు.

ఆసుపత్రికి వెళ్లి వచ్చిన వెంటనే !

ఆసుపత్రికి వెళ్లి వచ్చిన వెంటనే !

ఉదయం 11 గంటల సమయంలో సుబ్రమణి, మేనక దంపతులు ఇద్దరు కలిసి ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో వైద్యుడిని కలిసిన తరువాత మళ్లీ ఇంటికి చేరుకున్నారు. మద్యాహ్నం 1. 30 గంటల సమయంలో ఏం జరిగిందో తెలీదు కాని ఒక్కసారిగా సుబ్రమణి రెచ్చిపోయాడు. తరువాత భార్య మేనక మీద సుబ్రమణి చిందులు వేశాడు. లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ మూతపడటంతో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.

భార్యను గ్యాస్ సిలిండర్ తో కొట్టి చంపిన భర్త

భార్యను గ్యాస్ సిలిండర్ తో కొట్టి చంపిన భర్త

భార్య మేనక మీద ఆవేశంతో ఊగిపోయిన సుబ్రమణి ఒక్కసారిగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ తీసుకుని భార్య తల మీద దాడి చేసి చితకబాదేశాడు. ఆ సమయంలో ఆవేశంలో ఉన్న తండ్రి సుబ్రమణిని అడ్డుకోవడానికి ఇద్దరు కుమారులు ప్రయత్నించారు. చిన్న పిల్లలు కావడంతో సుబ్రమణిని అడ్డుకోవడం వారికి సాధ్యంకాలేదు. తలకు తీవ్రగాయాలై రక్తం ఎక్కువ పోవడంతో మేనక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

ఆసుపత్రిలో ఏం జరిగింది ?

ఆసుపత్రిలో ఏం జరిగింది ?

భార్య మేనకను చంపేసిన సుబ్రమణి ఇంట్లోని మేడ మీద ఉన్న గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. తల్లి హత్యకు గురి కావడంతో మేనక ఇద్దరు పిల్లలు గట్టిగా కేకలు వేశారు. విషయం గుర్తించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా మేనక రక్తపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించి ముత్యాలపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మేడ మీద ఉన్న గది తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే ఉరి వేసుకున్న సుబ్రమణి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటనకు ముందు దంపతులు ఇద్దరు ఆసుపత్రికి వెళ్లారని, అక్కడ ఏం జరిగింది ? అనే విషయం మాత్రం తెలియడం లేదని స్థానికులు అంటున్నారు.

Recommended Video

    Lockdown 5 : Restaurants And Hotels To Reopen From June 8 In Andhra Pradesh
    ఒకే రోజు తల్లిదండ్రులు ఇలా !

    ఒకే రోజు తల్లిదండ్రులు ఇలా !

    గత కొంత కాలం నుంచి సుబ్రమణి మానసిక అస్వస్థతకు గురై భాదపడుతున్నాడని, ఆసుపత్రికి వెళ్లి వచ్చిన తరువాత ఎందుకు భార్యను హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం తెలియడం లేదని, విచారణ చేస్తున్నామని ముత్యాలపేట పోలీసులు తెలిపారు. తల్లి హత్యకు గురి కావడం, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు ఒకేరోజు అనాథలు అయ్యారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+