వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: లాక్‌డౌన్‌కి సంబంధించి హోంశాఖ కొత్త మార్గదర్శకాలు ఇవే, వేటికి మినహాయింపులు.?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ స్ప్రెడ్ అవడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి 12 గంటల నుంచి మూడువారాల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ప్రజల ఇబ్బందులను గమనించి కేంద్ర హోంశాఖ కొన్నింటికీ సడలింపులు చేసి.. బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

 Coronavirus lockdown: MHA issues fresh guidelines on exemptions

లాక్‌డౌన్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు, రక్షణ, ఆర్మ్‌డ్ ఫోర్స్, ట్రెజరీ, పెట్రోలియం, సీఎన్జీ, ఎల్పీజీ, పీఎన్జీ, విపత్తుల నిర్వహణశాఖ, విద్యుత్ ఉత్పత్తి, పోస్టు ఆఫీసులకు మినహాయింపును ఇచ్చారు. కొత్త నిబంధనల్లో ఆర్బీఐ, ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఫైనాన్షియల్ మార్కెట్, పే అండ్ అకౌంట్ ఆఫీసర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ ఆఫ్ కాగ్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఫారెస్ట్ స్టాఫ్‌ను కూడా మినహాయింపును ఇచ్చారు.

ఆస్పత్రి, మెడికల్, మందుల ఉత్పత్తి, పంపిణీ యూనిట్లు, డిస్పెన్సరీ, కెమిస్ట్, డ్రగ్గిస్ట్, షాప్, క్లినిక్, అంబులెన్స్‌లకు మినహాయింపును ఇచ్చారు. వీరితోపాటు మెడికల్ సిబ్బంది, నర్సులు, పారా మెడికల్ స్టాప్, ఇతర సిబ్బందిని కూడా అనుమతించారు. వెటర్నరీ ఆస్పత్రి, ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ల్యాబ్‌లకు కొత్తగా అనుమతిచ్చారు.

కమర్షియల్, ప్రైవేట్ సంస్థలు మూసివేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంక్, ఇన్సూరెన్స్ ఆఫీసు, ఏటీఎం మాత్రం తెరిచి ఉంటుంది. బ్యాంకునకు సంబంధించి ఐటీ విభాగం, బ్యాంకింగ్ కరస్పాండెంట్, ఏటీఏం ఆపరేషన్, క్యాష్ మేనేజ్‌మెంట్‌కు కూడా కొత్తగా మినహాయింపును ఇచ్చింది.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

వస్తువుల ఉత్పత్తి, ప్రొడక్షన్ యూనిట్లను క్లోజ్ చేశారు. అయితే అవసరమైన ఉత్పత్తులను ప్రొడక్ట్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్, మెడికల్ డివైజ్ ఉత్పత్తికి అనుమతించారు. రైలు, రోడ్డు, వాయు మార్గాల్లో పౌరులకు నిషేధం విధించి.. వస్తువులు, అగ్నిమాపక, శాంతి భద్రతల కోసం మాత్రం ఉపయోగిస్తున్నారు. దీనిని ఢిల్లీ కమిషనర్ స్థాయి, అధికారులు పరిస్థితి దృష్ట్యా రవాణ కోసం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

English summary
Ministry of Home Affairs Wednesday issued several additional guidelines for essential service providers after pm Modi announced a 21-day lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X