వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: ప్రముఖ ఆలయాలు, మసీదులు ఓపెన్, భక్తులు ఇలా వెళ్లాలి, ఎక్కడా తేడా రాకూడదు, ఓకేనా!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు: లాక్ డౌన్ 5.0లో మరన్ని సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో సోమవారం వేకువ జామున దేశంలోని అనేక ప్రముఖ ఆలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకున్నాయి. శానిటైజర్ తో చేతులు శుభ్రం చేయించి కచ్చితంగా ముఖానికి మాస్కులు వేసుకునే విదంగా నియమాలను పాటిస్తున్న భక్తులు ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెలుతున్నారు.

Recommended Video

Unlock 1.0 : Watch Religious Places Reopen Across The Country

80 రోజులుగా మూతపడిన ఆలయాలు ఒక్కసారిగా తెరుచుకోవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూకట్టారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల, సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు మసీదులు, చర్చిలు సోమవారం తెరుచుకున్నాయి. కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాపించకుండా ఆలయ అధికారులు, మసీదు, చర్చిల పెద్దలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Coronavirus: విదేశీ తబ్లీగిలకు ఆశ్రయం, కార్పోరేటర్ కు కరోనా, ఎమ్మెల్యేకి టెన్షన్, తిక్కచేష్టలు!Coronavirus: విదేశీ తబ్లీగిలకు ఆశ్రయం, కార్పోరేటర్ కు కరోనా, ఎమ్మెల్యేకి టెన్షన్, తిక్కచేష్టలు!

చాందిని చౌక్ లో గౌరిశంకరుడు!

చాందిని చౌక్ లో గౌరిశంకరుడు!

దేశ రాజధాని న్యూఢిల్లీలోని చాందిని చౌక్ లోని శ్రీ గౌరిశంకర్ దేవాలయం సోమవారం వేకువ జామున తెరుచుకుంది. ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూకట్టారు. న్యూఢిల్లీలోని కల్కాజీ దేవాలయంలో సోమవారం వేకువజామున నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని నియమాలు పాటించిన పూజారులు ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేస్తున్నారు. భక్తులు కచ్చితంగా మాస్కులు వేసుకుని వచ్చి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకునే విదంగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

యూపీలో ఈద్గా మసీదు

యూపీలో ఈద్గా మసీదు

ఉత్తరప్రదేశ్ లోని లక్నోలోని ఈద్గా మసీదులో ప్రార్థనలు చెయ్యడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈద్గా మసీదులో ప్రార్థనలు చెయ్యడానికి ముస్లీం సోదరులు సోమవారం వేకువ జామున నుంచి క్యూకట్టారు. ప్రభుత్వం ఆదేశాలు కచ్చితంగా పాటించాలని, సబ్బులు, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుని ముఖానికి మాస్కులు వేసుకుని ప్రార్థనలు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశించడంతో భక్తులు ఆ నియమాలను పాటిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.

దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో కచ్చితంగా!

దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో కచ్చితంగా!

దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ఒకేసారి ఎక్కువ మంది పూజలు, ప్రార్థనలు చెయ్యడానికి వీలులేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భక్తులు ఎక్కువ మంది వచ్చినా ప్రతిఒక్కరు కనీసం ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని, పూజలు, ప్రార్థనలు చేసే సమయంలో ప్రతిఒక్కరు కచ్చితంగా మాస్కులు వేసుకుని ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

అక్కడ ఆలయాలు, మసీదులు క్లోజ్

అక్కడ ఆలయాలు, మసీదులు క్లోజ్

దేశంలోని అన్ని కంటోన్మెంట్ జోన్లలో కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా ఉండటానికి ఆ ప్రాంతాల్లోని ఆలయాలు, మసీదులు, చర్చిలు తెరవకూడదని కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. కంటోన్మెంట్ జోన్ల పరిధిలో లేని ఆలయాలు, మసీదులు, చర్చిలు తెరవడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశంలోని వివిద ప్రాంతాల్లోని కంటోన్మెంట్ జోన్లలో ఆలయాలు, మసీదులు, చర్చిలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పరిధిలోని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారచేసింది.

ఆలయాలు, మసీదుల్లో ఇలా చెయ్యాలి

ఆలయాలు, మసీదుల్లో ఇలా చెయ్యాలి

*. ఆలయాలు, మసీదులు, చర్చిల ప్రవేశద్వారంలో కచ్చితంా థర్మల్ స్క్రీనింగ్ ఉండాలని, శానిటైజర్ అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

*. కరోనా వైరస్ లక్షణాలు ఏమాత్రం లేనటువంటి భక్తులకు మాత్రమే ఆలయాలు, మసీదులు, చర్చిల్లోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలి.

*. ముఖానికి మాస్కులు, లేదా వస్ర్తం కచ్చితంగా వేసుకోవాలని.

*. ఆలయాలు, మసీదులు, చర్చిల దగ్గర కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తోంది, ఆ వ్యాధి వ్యాపించుకుండా తీసుకునే జాగ్రత్తలపై పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యాలని, వీలైతే ఆడియో సందేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

*. ఆలయాలకు వచ్చే భక్తులు వారి పాదరక్షలు వారి సొంత వాహనాల్లో పెట్టుకునే విదంగా చర్యలు తీసుకోవాలని, వాహనాలు లేని వారి పాదరక్షలు, షూలు ప్రత్యేకంగా పెట్టడానికి ఏర్పాట్లు చెయ్యాలని ధార్మిక కేంద్రాల నిర్వహన కమిటీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

*. ధార్మిక కేంద్రాల దగ్గర వాహనాలు పార్కింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయాలు, మసీదులు, చర్చిల పరిసర ప్రాంతాల్లోని షాపులు, పూల దుకాణాలు, క్యాంటిన్లు, హోటల్స్ దగ్గర భౌతిక దూరం పాటించాలి. ఆలయాలు, మసీదుల్లోకి ప్రవేశించే సమయంలో ప్రతిఒక్క భక్తుడు కనీసం ఆరు అడుగుల దూరం ఉండే విదంగా భౌతిక దూరం పాటించాలి.

*. ఆలయాల్లో ప్రసాదాలు, తీర్థం ఇవ్వకూడదు. ఆలయాల్లోని విగ్రహాలు, ఫోటోలు, గొడలు, పుస్తకాలను ఎవ్వరూ ముట్టుకోకూడదు. ధార్మిక కేంద్రాల్లో భజనలు, పాటలు, స్లోకాలు ఆలపించడానికి అవకాశం లేదు.

*. ప్రతి ఆలయంలో, మసీదులు, చర్చిల్లో కరోనా వైరస్ వ్యాపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని, ఈ నియమాలు అన్ని పాటించిన తరువాతే భక్తులు ధార్మిక కేంద్రాల్లో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.

English summary
Lockdown: Religious Places Open From June.08 In India. People gather at the Temple And Masjid For Prayer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X