Lok Poll survey: ప్రతిపక్షానికి బిగ్ షాక్- కలలు కల్లలే

రాయ్‌పూర్: ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సహా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వ్యూహ, ప్రతివ్యూహాలను పన్నుతోన్నాయి.

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీనే మొదట ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పటికీ.. ఆ తరువాత జరిగిన ఆపరేషన్ లోటస్ నేపథ్యంలో అధికారాన్ని బీజేపీకి కోల్పోవాల్సి వచ్చింది. ఇక తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సమాయాత్తమౌతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే జిల్లా పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.

Lok Poll survey on Chhattisgarh: Congress will hold the govt

ఈ పరిస్థితుల మధ్య లోక్ పోల్ సర్వే వెలువడింది. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వే, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థ ఇది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌పై సర్వే చేపట్టింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఇది. జూన్ 1 నుంచి జులై 5వ తేదీ వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. మొత్తంగా 13,500 మంది అభిప్రాయాలను సేకరించింది. వాటిని కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.

ఈ సర్వే ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే మెజారిటీ సీట్ల సంఖ్య కొంత తగ్గినప్పటికీ.. అధికారాన్ని అందుకుంటుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 56 నుంచి 60 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న సీట్ల సంఖ్య 71. 43 నుంచి 45 వరకు ఓట్ల శాతాన్ని దక్కించుకుంటుంది కాంగ్రెస్. ఇక బీజేపీ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని లోక్ పోల్ సర్వే అంచనా వేసింది. 25 నుంచి 29 స్థానాలు మాత్రమే లభిస్తాయని అభిప్రాయపడింది.

బీజేపీకి లభించే ఓట్ల శాతం 37 నుంచి 39 వరకు ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం బీజేపీకి ఉన్న సీట్లు 14 మాత్రమే. బహుజన్ సమాజ్‌వాది పార్టీ ఒకటి లేదా రెండు, జేసీసీ- 2, ఇతరులు ఒక స్థానాల్లో విజయం సాధిస్తారని లోక్‌పోల్ సర్వే తెలిపింది. తమ సర్వేలో ఎంతమంది పురుషులు, మహిళలు, విద్యార్థులు, యువకులను పరిగణనలోకి తీసుకున్నామనే విషయాన్ని మలివిడతలో వెల్లడిస్తామని లోక్‌పోల్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+