క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
Lok Sabha election 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికల ఘట్టానికి తెర లేచింది. మొత్తం ఏడు దశల్లో ముగిసే ఎన్నికలు ఇవి. తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలయింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశల పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లల్లో అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లోని ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొంటారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఓటర్లు ఎవరికి పట్టాభిషిక్తులను చేస్తారనేది 4వ తేదీన తేలిపోతుంది.

లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ షెడ్యూల్ అయింది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు.
తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకూ నేడే పోలింగ్ జరుగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి నిల్చున్నారు. పలువురు ప్రముఖులు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు శివగంగ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి పీ కార్తీ చిదంబరం ఓటు వేశారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. చెన్నై శాలిగ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి.. సేలంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.సూపర్ స్టార్ అజిత్.. సైతం తొలి గంటలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆయన చెన్నై తిరువాన్మియుర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటర్లతో పాటు క్యూలో నిల్చున్నారు. తన వంత వచ్చేంత వరకూ క్యూలోనే ఉన్నారాయన. అనంతరం ఓటు వేశారు.
-
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications