మోగిన నగారా: లోకసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఏపీ-తెలంగాణల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు
Recommended Video

Lok Sabha Election 2019 Schedule | Oneindia Telugu
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు లోకసభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికలు ఉంటాయనే వాటితో పాటు పలు అంశాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని సీఈసీ చెప్పారు. తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు కనిపించనున్నాయి. ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు నిర్వహిస్తారు.

ఫేజ్ 1 ఎన్నికలు: ఏప్రిల్ 11వ తేదీన తొలి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 2 ఎన్నికలు: ఏప్రిల్ 18వ తేదీన రెండో విడత పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 3 ఎన్నికలు: ఏప్రిల్ 23వ తేదీన మూడో విడత పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 4 ఎన్నికలు: ఏప్రిల్ 29వ తేదీన నాలుగో విడత పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 5 ఎన్నికలు: మే 6వ తేదీన ఐదో విడత పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 6 ఎన్నికలు: మే 12వ తేదీన ఆరో విడత పోలింగ్ ఉంటుంది.
ఫేజ్ 7 ఎన్నికలు: మే 19వ తేదీన ఆరో విడత పోలింగ్ ఉంటుంది.
READ MORE












Click it and Unblock the Notifications