Lok Sabha polls Phase 5: లోక్ సభ పోరు ఐదో దశలో చురుగ్గా పోలింగ్-11 గంటలకు 24 శాతం..!

దేశంలోని ఆరు రాష్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 49 లోక్ సభ సీట్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ చురుగ్గా కొనసాగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇందులో యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లపై అందరి దృష్టీ నెలకొంది. పోలింగ్ కేంద్రాలకు భారీ ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం మరోసారి కోరింది.

రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్, స్మతీ ఇరానీ, ఒమర్ అబ్దుల్లా వంటి నేతల భవితవ్యం తేల్చబోతున్న ఈ ఐదో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో ఉదయం 11 గంటల వరకూ 20 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ముఖ్యంగా యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ వంటి సీట్లలో ఈసారి ఎవరు గెలవబోతున్నారనే దానిపైనా ఉత్కంఠ నెలకొన్న వేళ పోలింగ్ శాతాలు కీలకంగా మారబోతున్నాయి.

lok sabha election phase 5 polling brisk voting continued as 20 pecent turnout records till 11am

ఉదయం 11 గంటల కల్లా 23.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. ఇందులో పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 32.7 శాతం పోలింగ్ నమోదైంది. లడఖ్ లో 27.87 శాతం, యూపీలో 27.76 శాతం పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో మాత్రం అత్యల్పంగా 15.93 శాతం పోలింగ్ జరిగింది. దీంతో ప్రధాని మోడీ సహా ప్రముఖులు భారీ ఎత్తున ఓట్లు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+