Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. తొలి దశ ఎన్నికల్లో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు శుక్రవారం అంటే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
కాగా, తొలి దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగే ఎన్నికల ప్రక్రియను శాంతియుంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద పెద్ద మొత్తంలో కేంద్ర బలగాలను మోహరించింది.

102 లోకసభ స్థానాలకు జరిగే పోలింగ్‌లో 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. ఇందుకోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం ఐదు గంటలకే ముగియనుంది.
#WATCH | West Bengal: In the first phase of #LokSabhaElections2024 tomorrow, Jalpaiguri, Cooch Behar and Alipurduar will go to polls.
— ANI (@ANI) April 18, 2024
Visuals from Jalpaiguri where polling parties are being dispatched for polling stations. pic.twitter.com/vPcNCX9Jq8
తొలివిడత ఎన్నికలు జరిగే 102 స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా, 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. 16.63 కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్లు పురుషులు, 8.23 కోట్లు మహిళలు కాగా, 11 వేల 371 మంది థర్డ్ జెండర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. కాగా, 35.67లక్షలమంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
#WATCH | Golaghat, Assam | Security personnel and polling parties with EVMs dispatched for Kaziranga Parliamentary constituency ahead of the first phase of #LokSabhaElection2024 tomorrow, 19th April. pic.twitter.com/b50wpBOt97
— ANI (@ANI) April 18, 2024
50శాతం కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలో వెబ్‌కాస్టింగ్ చేయడం సహా అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్‌లను ఈసీ నియమించింది. తొలిదశ పోలింగ్ కోసం మొత్తం 361 పరిశీలకులను నియమించిన ఈసీ.. వారిలో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు ఉన్నట్లు వివరించింది. 4వేల 627 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 5వేల 208 స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు, 2వేల 28 వీడియో సర్వైలెన్స్ టీమ్‌లు, 1255 వీడియో వ్యూయింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసింది.
ప్రాంతాల వారీగా స్థానాలు
80 స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, 40 సీట్లు ఉన్న బిహార్, 42 సీట్లు ఉన్న బంగాల్లో మొత్తం ఏడు విడతల్లోనూ పోలింగ్ ఉండగా తొలివిడత యూపీలో 8, బిహార్‌లో 4, పశ్చిమబెంగాల్లో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు జరిగాయి. అసోంలో 5, ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 5, రాజస్థాన్ 12, జమ్ముకశ్మీర్‌లో ఒక నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.102 లోకసభ నియోజకవర్గాలతోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తొలి దశలో ప్రముఖులు వీరే
నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, భూపేంద్ర యాదవ్, అన్నామలై, కనిమొళి, సర్బనాంద సోనోవాల్, అర్జున్ మేఘ్ వాల్, ఎల్ మురుగన్, బిష్ణవ్ కుమార్ దేవ్, తమిళిసై సౌందరరాజన్, గౌరవ్ గొగొయ్, జితిన్ ప్రసాద, జీతన్ రామ్ మాంఝీ, నకుల్ నాథ్ తదితరులుఉన్నారు.
-
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications