Lok Sabha: 816కు లోక్ సభ సీట్లు..! ఉత్తరాదిలో గెలిస్తే అధికారమేనా ?

కేంద్ర ప్రభుత్వం త్వరలో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్ సభ (lok sabha) సీట్లను 816కు పెంచేందుకు సిద్దమవుతోంది. స్ధూలంగా చూస్తే ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల సంఖ్య పెరుగుతుందని అర్థమవుతోంది. అయితే అక్కడే లాజిక్ అంతా ఉంది. ఈ సీట్ల విస్తరణ కారణంగా కొన్ని రాష్ట్రాలు రాజకీయంగా బలపడనుండగా.. మరికొన్ని బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్క ఏంటో ఓసారి చూసేద్దాం..

తాజా ప్లాన్ ప్రకారం లోక్‌సభ ఎంపీల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుండి 816 స్థానాలకు పెరగనుంది. ఇందుో దాదాపు మూడింట ఒక వంతు, అంటే సుమారు 273 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేస్తారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుండి ఈ మార్పు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే లోక్‌సభ సీట్ల పునర్విభజన లేదా సరిహద్దుల పునర్విభజన 2011 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రాల వారీ సీట్ల కేటాయింపు ప్రకారం మొత్తం 543 లోక్‌సభ సీట్లలో ఉత్తర ప్రదేశ్‌కు అత్యధిక వాటా ఉంది. మొత్తం సీట్లలో ఇది 15% లేదా 80 సీట్లు. కొత్త లెక్క ప్రకారం 816 మంది సభ్యులున్న లోక్‌సభలో ఇదే నిష్పత్తిని కొనసాగించాలంటే, ఒక్క యూపీలోనే 120 సీట్లు ఉంటాయి. వీటిలో 40 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు.

Lok Sabha Expansion to 816 MPs Which States Gain Which States Lose Political Power

మహారాష్ట్రలో 48 నుండి 72 సీట్లకు పెరగనుండగా. ఇందులో 24 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు.బెంగాల్‌లో 42 సీట్లు 63కు పెరగనుండగా.. ఇందులో 21 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. బీహార్‌లో 40 నుండి 60 సీట్లకు పెంచి, అందులో మహిళలకు 20 సీట్లు రిజర్వ్ చేస్తారు. దక్షిణాదిలో తమిళనాడులో లోక్‌సభ సీట్ల సంఖ్య 39 నుండి 59కి పెరగనుండగా, ఇందులో 20 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. కర్నాటకలో 28 కాస్తా 36కు పెంచుతారు.

మధ్యప్రదేశ్‌లో 29 నుండి 44 సీట్లకు పెరిగితే, ఇందులో 15 సీట్లు మహిళలకు కేటాయిస్తారు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, త్రిపురలకు ఒక్కొక్క దానికి 2 లోక్‌సభ సీట్ల నుండి 3కి పెంచుతారు. ప్రస్తుతం ఒక్కో సీటు ఉన్న మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు కొత్త లోక్‌సభలో రెండేసి సీట్లు లభిస్తాయి. ఢిల్లీలోని 7 లోక్‌సభ సీట్లు 11కి పెరిగితే, అందులో 4 మహిళలకు రిజర్వ్ చేస్తారు. జమ్మూ కాశ్మీర్‌లోని 5 సీట్లు 8కి పెరిగితే, అందులో 3 మహిళలకు రిజర్వ్ చేస్తారు. లడఖ్, పుదుచ్చేరి వంటి ఏకసభ్య కేంద్రపాలిత ప్రాంతాలలో సీట్ల సంఖ్య పెరుగుతుందా లేదా, వాటిని మహిళలకు ఎలా రిజర్వ్ చేస్తారనేది ఇంకా స్పష్టంకాలేదు.

Lok Sabha Expansion to 816 MPs Which States Gain Which States Lose Political Power

మరోవైపు కేంద్రం తాజా ప్రతిపాదనల ప్రకారం చూస్తే దక్షిణాదితో సంబంధం లేకుండానే ఉత్తరాదిలో సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండటం చర్చనీయాంశమవుతోంది. దీంతో కేంద్రం ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు, లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపు విషయాల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రం విడివిడిగా పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. అలా కాకుండా అఖిలపక్ష భేటీ ఏర్పాటు కోసం విపక్షాలు పట్టుబడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+