బీహార్‌లో ఎన్డీఏ సీట్ల పంపకాలు పూర్తి: ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందంటే?
పాట్నా: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024)కు బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మఁధ్య సీట్ల పంపకం పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఇక, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ పార్టీ 16 స్థానాలు, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జేపీ(రాంవిలాస్ పాశ్వాన్) పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీల అంగీకారం తెలిపాయి.
ఇక మిగితా రెండు ఎన్డీఏ భాగస్వామి పార్టీలైన హిందుస్థానీ అవామ్ మోర్చా, ఉపేంద్ర కుష్వామాకు చెందిన రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ చెరో ఒక్కో స్థానాల్లో పోటీ చేస్తాయని బీజేపీ బీహార్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ వినోద్ తాడ్వే తెలిపారు. చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ సీటు నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ నేత రాజు తివారీ చెప్పారు.

మరోవైపు, ఎల్జేపీలో మరోవర్గం నేత, కేంద్రమంత్రి పశుపతి పరాస్ వర్గానికి ఈ సీట్ల పంపకంలో ఎలాంటి ప్రాధాన్యం కల్పించకపోవడం గమనార్హం. అయితే, ఆయనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తి కావడంతో ప్రచారంలో మరింత దూరకుడును ప్రదర్శించనున్నారు.
కాగా, 2019 ఎన్నికలలో బీజేపీ, జేడీయూ, ఎల్‌జెపిలతో కూడిన ఎన్డీఏ కూటమి 53% కంటే ఎక్కువ ఓట్‌షేర్‌తో 39 సీట్లు సాధించడం గమనార్హం. ఇక, 'మహాగత్‌బంధన్' కంటే గణనీయమైన ప్రయోజనాన్ని పొందింది. బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క సీటును గెలుచుకోగా, ఆర్జేడీ ఒక్క లోక్‌సభ స్థానాలను కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications