బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. కోటి లంచం కేసు: రావ్‌పై మరో చార్జ్ షీటు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక లోకాయుక్తలో జరిగిన అవినీతి గురించి దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు (సిట్) మరో చార్జ్ షీటు తయారు చేసి లోకాయుక్త ప్రత్యేక కోర్టులో సమర్పించింది. అశ్విన్ రావ్, హోట్టే కృష్ణ, నరసింహమూర్తి అనే ముగ్గురి మీద బుధవారం కోర్టులో ఎఫ్ఐఆర్ సమర్పించారు.

బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి భూములను బెంగళూరు అభివృద్ది ప్రాధికార (బీడీఏ) స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న భూమికి నష్టపరిహారం చెల్లించింది. అయితే బీడీఏ ఇంటి స్థలాలు ఇవ్వడంలో ఆలస్యం అయ్యింది.

ఈ విషయం పరిష్కరించడానికి రూ. 15 లక్షలు ఇవ్వాలని వెంటనే మీ పనులు పూర్తి చేస్తామని నరసింహమూర్తి అనే వ్యక్తి శ్రీనివాస్ ను సంప్రధించాడు. ముందుగా అడ్డాన్స్ కింద రూ. మూడు లక్షలు తీసుకున్నారు.

lokayukta filed a charge sheet to lokayukta court against Ashwin Rao

రూ. మూడు లక్షల నగదును అశ్విన్ రావ్, హోట్టే కృష్ణ, నరసింహమూర్తి పంచుకున్నారని సమాచారం. దీనిపై శ్రీనివాస్ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేసిన అధికారులు 1,250 పేజీల చార్జ్ షీటు తయారు చేసి లోకాయుక్త ప్రత్యేక కోర్టులో సమర్పించారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన వై. భాస్కర్ రావ్ కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన కుమారుడు అశ్విన్ రావ్. తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని తన అనుచరులతో అనేక మంది ప్రభుత్వ అధికారులను బెదిరించి లంచం వసూలు చేశాడని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.

ఈ ఆరోపణల వలనే ఇటీవల భాస్కర్ రావ్ తన పదవికి రాజీనామా చేశారు. కొన్ని నెలల క్రితం అరెస్టు అయిన అశ్విన్ రావ్, అతని అనుచరులు, ప్రభుత్వ ఉద్యోగులు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఇప్పుడు మరో చార్జ్ సీట్ వెయ్యడంతో వీరి దిమ్మతిరిగింది.

English summary
A special investigation team (SIT) probing the case of corruption in lokayukta filed a charge sheet to lokayukta court against Ashwin Rao son of former Karnataka lokayukta Y.Bhaskar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X