Lokniti-CSDS Pre-Poll survey 2024: లోక్ సభ ఎన్నికల్లో ఆధిక్యంలో ఎవరు ? కారణాలేంటి ?
త్వరలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇందులో ఎవరు గెలవబోతున్నారు, ప్రజల నాడి ఎటువైపు ఉంది, దానికి గల కారణాలేంటన్న దానిపై లోక్ నీతి-సీఎస్డీఎస్ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. దీని ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇందులో ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు సర్వే తేల్చింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా బాగా పుంజుకున్నట్లు తెలిపింది.
లోక్ నీతి-సీఎస్డీఎస్ ప్రీపోల్ సర్వేలో విపక్ష ఇండియా కూటమి కంటే బీజేపీ 12 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. దేశంలోని ప్రతీ 10 మంది ఓటర్లలో నలుగురు బీజేపీకి మద్దతిస్తున్నట్లు నిర్ధారణ అయింది. కాంగ్రెస్ బాగా పుంజుకుంటున్నా బీజేపీని అడ్డుకునే స్ధాయిలో లేదని వెల్లడైంది. సగానికి పైగా ఓటర్లు బీజేపీ పదేళ్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే మోడీ సర్కార్ కు హ్యాట్రిక్ అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.

అలాగే రాహుల్ గాంధీ హామీల కంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ 'మోడీ హామీ' ఓటర్లలో ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు బీజేపీ ఆధిక్యం కొనసాగుతున్నా 2019తో పోలిస్తే ప్రభుత్వ పనితీరులో గణనీయంగా క్షీణత ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు మరోసారి బీజేపీకి ఓటేసే విషయంలో ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. వ్యక్తిత్వ అంశంలో రాహుల్ గాంధీ కంటే మోడీవైపే సగం మంది ఓటర్లు మొగ్గుచూపారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం మోడీ చేసిన పనుల్లో అత్యంత మొప్పు పొందినట్లుగా తేలింది. ముఖ్యంగా ఎన్డీయే మద్దతుదారులు దీన్ని ప్రశంసిస్తున్నారు. పెరుగుతున్న ధరలు మరియు పెరుగుతున్న నిరుద్యోగం ఓటర్లలో ముఖ్యమైన ఆందోళనలు, మోడీ, బీజేపీపై జనంలో ఆదరణ కొనసాగుతోందన్న భావనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు సర్వే తెలిపింది.అలాగే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, బిజెపి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.
అలాగే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కీలక అంశాలుగా ధరల పెరుగుదల , నిరుద్యోగంపై ఆందోళనలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. సగానికి పైగా ఓటర్లు వీటి గురించి ఆలోచిస్తున్నట్లు సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది ఉద్యోగాలు కీలకమని చెప్పారు. ముస్లింలు, వెనుకబడిన వర్గాల హిందువులు, ఎస్సీ, ఎస్టీలు, అగ్రవర్ణాల్లోనూ ఉద్యోగాల కొరత ఎన్నికల అంశంగానే భావిస్తున్నారు. అలాగే 71 శాతం మంది ధరల పెరుగుదలను కూడా ఎన్నికల అంశంగా భావిస్తున్నారు.
55 శాతం మంది గత ఐదేళ్లలో అవినీతి పెరిగిందని చెప్పారు.












Click it and Unblock the Notifications